నవజాత శిశువులకు కరోనా వైరస్ సోకడానికి కారణాలివే..?

దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పుట్టిన పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వారకు ఎవరినీ వదలడం లేదు. నవజాత శిశువులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నవజాత శిశువులకు కరోనా ఎలా సోకుతుందో మొదట్లో శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాలేదు. అయితే శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించగా ఆ అధ్యయనంలో కరోనా వైరస్ నవజాత శిశువులకు సోకడానికి సోకడానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి.

ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనా సోకిన శిశువుల్లో 30 శాతం మంది శిశువులు గర్భంలో ఉన్న సమయంలోనో లేదా ప్రసవ సమయంలోనో కరోనా బారిన పడుతున్నారని తేలింది. 176 పబ్లిష్డ్ కేసులను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. చాలామంది నవజాత శిశువులు ప్రసవం తరువాతే వైరస్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. గర్భంలో శిశువుకు కరోనా సోకడం అరుదుగా మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు.

నవజాత శిశువులకు కరోనా వైరస్ సోకినా వాళ్లలో చాలా తక్కువగా మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని.. కరోనా శిశువులు జన్మించిన తరువాత సంభావ్య ముప్పును ఎదుర్కొంటున్నారా..? అనే ప్రశ్నకు పరీక్షల ద్వారా మాత్రమే సమాధానం లభిస్తుందని అన్నారు. 70 శాతం మంది శిశువులను ఆస్పత్రిలో తల్లి ద్వారా, ఇతర మార్గాల ద్వారా వైరస్ సోకుతున్నట్టు తేలిందని వెల్లడించారు.

మెడికల్ సిబ్బంది, బంధువులు, కరోనా రోగుల ద్వారా నవజాత శిశువులకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరోవైపు కరోనా మహమమరిని కట్టడి చేసే వ్యాక్సిన్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ కావడంతో వ్యాక్సిన్ మరింత ఆలస్యం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండటం గమనార్హం.