మీకు చాయ్ తాగే అలవాటు ఉందా.. అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి..

ఛాయ్ అంటే ఎవరకి ఇష్టం ఉండదండి.. ప్రతీ ఒక్కరికీ ఇష్టమైన పానీయం ఇది. అయితే దీనిని ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఒకప్పుడు తీసుకునే వారు. ఒత్తిడిని తగ్గించుకునే దిశలో చాలామంది వేడివేడిగా ఏదో ఒకటి తాగుతారు. కానీ ప్రస్తుతం టైం పాస్ కోసం కూడా ఛాయ్ ని తాగుతున్నారు. సరదాగా అలా స్నేహితులతో కలిసి వెళ్లినా ఓ చాయ్​ లాగించే జనాలు కోకొల్లలు. ఇక టిఫీన్‌ చేయగానో ఓసారి, లంచ్‌కు ముందు మరోసారి మళ్లీ సాయంత్రం స్నాక్స్‌ తిన్న తర్వాత మరోసారి, చలి ఎక్కువగా ఉంటే రాత్రి ఇంకోసారి ఇలా కప్పు మీద కప్పు వేస్తూ చాయ్‌ ప్రేమికులు లొట్టలేసుకుంటూ తాగేస్తుంటారు.

ఇలా ఎక్కువగా చాయ్ లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సైడ్​ ఎఫెక్స్ట్​ కూడా ఉన్నాయంట. చాయ్‌ తయారీ కోసం ఉపయోగించే టీ పౌడర్‌లో నికోటిన్‌, కెఫిన్‌ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవే ఇపుడు ప్రమాదానికి కారణాలు అయ్యాయి. ఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిగా కారకాలుగా మారుతున్నాయట. చాయ్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. అందుకే చాయ్ తగిన వెంటనే ఆకలి వేయదు. చాయ్‌ తాగగానే ఒక్క సారిగా శరీరానికి శక్తి అందిన ఫీలింగ్‌ కలుగుతుంది.

అయితే ఎంత ఫాస్ట్‌గా శక్తి వస్తుందో అంతే వేగంగా వెళ్లిపోతుంది. ఇటీవల కాలంలో 30 ఏళ్ల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాయ్ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. టీ పౌడర్ లో వాడే కొన్ని పదర్ధాలు ఎముకలను బలహీన పరుస్తాయి.

వేడి చాయ్ తాగడం వల్ల కూడా భవిష్యత్ లో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. భవిష్యత్తులో గొంతు క్యాన్సర్‌(cancer)కి కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మెల్లగా చాయ్ తాగడం బంద్ చేస్తే మంచిది. దాని బదులు గ్రీన్ టీ, లెమన్ టీలు తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.