2021 In Review: 2021 సంవత్సరం ఏ హీరోలకు కలిసి వచ్చిందో.. ఓ లుక్కేయండి!

2021 In Review: 2021 సంవత్సరం ఏ హీరోలకు కలిసి వచ్చిందో.. ఓ లుక్కేయండి!

2021 In Review: ఓవైపు కరోనా..మరో వైపు లాక్ డౌన్ల వల్ల సినిమా ఇండస్ట్రీ 2021లో తీవ్ర ఇబ్బందులు పడింది. చాలా వరకు సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే కొంత మంది హీరోలకు మాత్రం 2021 కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. వరసగా ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సదరు హీరోలను 2021 గట్టెక్కించింది. ఈ ఏడాది హిట్లు పడటంతో కొంతలోకొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఏడాదిలో హిట్లు కొట్టిన హీరోలెవరో తెలుసుకుందాం.. 

వెంకటేష్:
ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య రిమేక్ సినిమాలనే చేస్తున్నాడు. ధనుష్ హీరోగా తమిళంలో ’అసురన్‘గా వచ్చిన సినిమాను ’నారప్ప‘ పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. మళ్లీ వెంకీని దృశ్యం2 సినిమా ఫామ్ లోకి తెచ్చింది.

రవితేజ
మాస్ మాహారాజ రవితేజను వరసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు వెనక్కి నెట్టాయి. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి ప్లాప్ లతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే ’క్రాక్‘ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ అయ్యాడు.

అల్లరి నరేష్
గత కొన్నేళ్లుగా హిట్ లేని నరేష్ ’నాంది‘ సినిమా ద్వారా హిట్ కొట్టాడు. నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అయితే అంతకుముందు గత ఏడేనిమిది ఏళ్లుగా అల్లరి నరేష్ కళ్లుకాయలు కాసేలా చూశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన మహర్షి సినిమా తప్పితే చెప్పుకోదగిన హిట్ లేదు. అయితే నరేష్ కు నాంది ఊరట నిచ్చింది.

పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు హిట్లతో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తుంటాయి. ఇది అందరికి తెలిసిన నిజమే. అయితే గత కొన్నేళ్లుగా పవన్ కు ఆయన రేంజ్ కు తగిన హిట్ పడలేదు. మరోవైపు రాజకీయాల వల్ల గ్యాప్ తీసున్న చాలా రోజుల తర్వాత హిందీ ’పింక్‘ సినిమాను తెలుగులో ’వకీల్ సాబ్‘గా రిమేక్ చేసి హిట్ కొట్టాడు. 

శ్రీ విష్ణు.
మనకున్న కొద్దిమంది మంచి నటుల్లో శ్రీ విష్ణు ఒకరు. విభిన్న చిత్రాలు తీస్తుంటాడనే పేరు శ్రీ విష్ణుకు ఉంది. అయితే గతంలో శ్రీ విష్ణు చేసిన గాలి సంపత్, తిప్పరా మీసం సినిమాలు ఘోరంగా తన్నాయి. అయితే ’రాజరాజచోర‘ సినిమా మాత్రం విష్ణుకు మళ్లీ బూస్టప్ ఇచ్చింది.

నాని.
నానీస్ గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్ ఇలా వరస ఫ్లాపులతో కెరీర్లో వెనకబడిపోయాడు నాని. ఇలాంటి సమయంలో వచ్చిన శ్యాంసింగరాయ్ మళ్లీ నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. సినిమాలో రెండు క్యారెక్టర్లు పోషించిన నాని.. తన యాక్టింగ్ తో మెప్పించాడు.

బాలక్రిష్ణ.
నందమూరి నట సింహం ’ అఖండ‘ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతకుముందు బాలక్రిష్ణ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.