ఒత్తిడి ఎందుకు వస్తుంది.. తగ్గేందుకు ఏం చెయ్యాలి?

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది కలగడం సర్వ సాధారణమే. అయితే ఏదైనా పరీక్షకు వెళుతున్న సమయంలోనూ, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సమయంలోనూ, లేదంటే కొన్ని పరిస్థితులను తలచుకునప్పుడు మనకు ఈ విధమైనటువంటి ఒత్తిడి కలగడం సర్వసాధారణమే. అయితే ఈ రకమైన ఒత్తిడి ఏదో ఒక రోజు మాత్రమే కలుగుతుంది. కాని కొంత మందిలో తరచూ ఈ విధమైనటువంటి ఒత్తిడి కలిగితే అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఈ విధమైనటువంటి ఒత్తిడి కలగడం వల్ల ఎలాంటి లక్షణాలు కనబడతాయి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఏం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనం అధిక భయం, ఒత్తిడికి గురి అయినప్పుడు మన మెదడుకు శరీరానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది. ఈ క్రమంలోనే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితులు ఎదురవుతాయి.అయితే ఈ విధమైనటువంటి ఒత్తిడి ఆందోళన అందరిలో ఒకేలా ఉండదు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అధికంగా ఒత్తిడికి గురి అయినప్పుడు ఎక్కువగా హార్ట్ బీట్ పెరగడం, శరీరం వనకడం, నోరు ఆరిపోవడం, చిరాకుగా ఉండటం అంటే శారీరక లక్షణాలు కనబడతాయి.

మరికొందరిలో ఏ పని పైన ఏకాగ్రత పెట్టకపోవటం, ఆలోచనలు రాకపోవడం, అధికంగా టెన్షన్ పడడం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు వీటి నుంచి బయటపడాలంటే ముందుగా అటువంటి వారిని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోబెట్టాలి. వారికి రాబోయే సమస్య నుంచి ఎలాంటి ప్రమాదం లేదని వారికి ధైర్యం చెప్పాలి.

అదేవిధంగా ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు కొన్ని నిమిషాల పాటు యోగా వంటి వాటిని చేయడం ద్వారా వారు ఇటువంటి సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారిలో శారీరక మానసిక లక్షణాలు అధికంగా ఉంటే వెంటనే వారిని వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి సరైన చికిత్స చేయించడం ఎంతో అవసరం.