ప్రస్తుత కాలంలో ఒక అపార్ట్ మెంట్ కట్టాలంటే ఎక్కువ సంఖ్యలో సిమెంటు, కంకర, ఇసుక, ఇనుము మనకు అవసరం అవుతుంది. ఇన్ని కలిస్తేనే మనకు ఎంతో దృఢమైన అపార్ట్మెంట్ తయారవుతుంది. ప్రస్తుత కాలంలో రోజురోజుకూ జనాభా పెరగడం వల్ల జనాలు నివసించడానికి స్థలం లేకపోవడంతోనే ఈ విధంగా అపార్ట్మెంట్లు మనకు దర్శనమిస్తున్నాయి. కానీ చైనాలో మాత్రం ప్రాచీన కాలంలోనే అపార్ట్మెంట్ లు ఉండేవి. అయితే ఆ అపార్ట్మెంట్ అన్ని ఇనుము, సిమెంట్ కాకుండా కేవలం మట్టితో నిర్మించినవి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
చైనాలో దాదాపు 12 వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఎంతో భద్రంగా ఉన్నాయి. అందుకే వీటిని UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇచ్చింది.ఎంతో అద్భుతమైన ఈ కట్టడాలు మట్టితో నిర్మించడం ఎంతో ఆశ్చర్యం. సాధారణంగా భవనాలు చతురస్రాకారంలో ఉండటం మనం చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం గుండ్రని మట్టి భవనాలు మనకు దర్శనమిస్తాయి. ఈ భవనాలను చూడటానికి రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ అద్భుతమైన కట్టడాలు చైనాలోని ఫ్యుజియన్‌లో ఉన్నాయి. అందుకే ఈ కట్టడాలను వీటిని ‘ఫ్యుజియన్ టులువ్’ అని పిలుస్తారు.
ఒక్కో భవనంలో సుమారు మూడు నుంచి ఐదు అంతస్తులు. వీటిలో సుమారు 50 కుటుంబాల వరకు జీవనం కొనసాగించే వారు. ఈ భవనాలు నిర్మించడానికి ఎక్కడా కూడా సిమెంటు, ఇనుము వాడకపోవడం విశేషం.అయితే అప్పట్లో బందిపోటు అధికంగా ఉండటం వల్ల గ్రామస్తులు అందరూ కలిసి ఈ విధమైనటువంటి కట్టడాలను నిర్మించుకొని అందరూ ఒకే చోట నివసించే వారు.వీరు బయటకు వెళ్ళడానికి వీలులేకుండా అన్ని ఆ భవనంలోనే సమకూర్చుకునే వారు. కాలక్రమేణా ఈ భవనాలలో నివసించే వారి సంఖ్య తక్కువగా అయినప్పటికీ ఈ భవనాలను వీక్షించే వారి సంఖ్య అధికమవుతోంది.
ఈ మట్టి భవనాలను నిర్మించడానికి కేవలం మట్టి కంకర ను మాత్రమే ఉపయోగించారు. ఇనుప కడ్డీలకు బదులుగా వెదురు బొంగులను వాడారు కేవలం భవనాల రక్షణ కోసం నిర్మించిన తలుపులకు మాత్రమే బయటవైపు ఇనుప కడ్డీలు ఉపయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫ్యుజిన్ వ్యాప్తంగా 20,000 టులులు ఉన్నాయి. వీటి మోడల్స్ నచ్చి చైనాలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మట్టి కట్టడాలు వెలిశాయి. అయితే ఈ కట్టడాలు అన్ని కాలాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి కట్టడాలు పెద్ద ఎత్తున పర్యటకులను ఆకర్షించు కుంటున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంతో అద్భుతమైన ఈ భవనాలను పర్వత ప్రాంతాలలో నిర్మించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. పర్వత ప్రాంతంలో నిర్మించిన ఈ కట్టడాలకు సంబంధించిన భవనాలను ఈ వీడియోలో చూడవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…