సినిమా జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో జగపతి బాబుకి తన నిజజీవితంలో కూడా తన జీవన విధానం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కానీ జగపతి బాబు మాత్రం ప్రకృతి ఒడిలోనే సేద తీరాలి అని చెబుతారు.వెండితెరపై హీరోగా, విలన్ గా, సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు పలు ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు.
సాధారణంగా ఒక సెలబ్రిటీ అంటే ఫైవ్ స్టార్ హోటల్, లగ్జరీ కార్లు, వివిధ రకాల ఆహార పదార్థాలు, వారిపై ఈగ కూడా వాలకుండా చుట్టూ బౌన్సర్లు ఇలా వారి జీవన విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కానీ హీరో జగపతి బాబు మాత్రం ప్రకృతి ఒడిలో పెరిగే ముద్దుబిడ్డ అని చెప్పవచ్చు.ప్రకృతి అమ్మలాంటిది అని ఆ అమ్మ తోనే మన జీవితం ముడిపడి ఉందని ఈ సందర్భంగా జగపతిబాబు తెలియజేశారు.
ప్రస్తుతం చాలామంది డబ్బు సంపాదించాలి, మన వెల్త్ బ్యాంకును క్రెడిట్ చేసుకోవాలని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వారి హెల్త్ బ్యాంక్ పూర్తిగా నాశనం అవుతుందని తెలిపారు. కేవలం డబ్బు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది అనడం ఏమాత్రం సరికాదని,అదే నిజమైతే డబ్బున్న వారు ఎవరు కరోనాతో చనిపోరని జగపతిబాబు తెలియజేశారు. డబ్బు, సంపాదన కంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.
పచ్చటి మొక్కల మధ్య, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరడం తనకెంతో ఇష్టమని,అదే విధంగా ప్రతి రోజు ఉదయం లేవగానే తను కేవలం చద్దన్నం మాత్రమే తీసుకుంటానని ఈ సందర్భంగా జగపతి బాబు తెలిపారు. చాలామంది చద్దన్నం తినడానికి ఎంతో నామోషీగా ఫీల్ అవుతారు. కానీ చద్దన్నం మన పాలిట మన ఆరోగ్యం పాలిట ఓ సంజీవని అని,రుచితోపాటు పోషకాలు అధికంగా ఉండే చద్దన్నం తినడం తనకెంతో ఇష్టమని ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ హీరో తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…