General News

అంతరిక్షంలోకి వెళ్లనున్న టిక్ టాకర్.. ఎవరంటే?

సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్ళేది కేవలం వ్యోమగాములనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి వారిని చూడాలన్నా సాధారణ ప్రజలకు సాధ్యం కాదు. అలాంటిది ఒక సామాన్యురాలు అంతరిక్షంలోకి వెళ్లి అవకాశాన్ని దక్కించుకుంది. అది ఒక సామాన్యురాలికి ఎలా సాధ్యం అయ్యింది అనే విషయాలను తెలుసుకుందాం.

వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ టూరిజం సంస్థ వచ్చే సంవత్సరం నుంచి మనుషులను అంతరిక్ష పర్యాటకానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షంలోకి వెళ్లిన పర్యాటకులకు అనుగుణంగా వారిపై పరిశోధనలను ప్రారంభించింది.ఈ క్రమంలోనే టిక్ టాకర్ గా స్టెమ్‌ అంశాలతోపాటు తల్లిగా తన అనుభవాలను టిక్‌టాక్‌, ఇన్స్టా ద్వారా షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కెల్లీ గెరార్డిని ఎంపిక చేశారు.

కెల్లీ కేవలం టిక్ టాకర్ గా మాత్రమే కాకుండా ఆమె ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌ (ఐఐఏఎస్‌)లో పరిశోధకురాలు. స్పేస్ టూరిజం పై కొంత ఆసక్తి, కొంత ఫాలోయింగ్ ఉండటంతో ఈ విధమైన ప్రయోగాలకు ఈమెను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈమె కేవలం అంతరిక్షంలో వెళ్లి రావడానికి మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఈమె పై ప్రయోగాలను నిర్వహించనున్నారు. జీరో గ్రావిటీ ఉన్న సమయంలో అంతరిక్షంలో మనిషి శరీరంలో జరిగే మార్పులు, శరీర బరువు పై సుమారు 60 నిమిషాల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా స్పేస్ ఫ్లైట్ లను మరింత సమర్థవంతంగా పునరుద్ధరించాలని ఆలోచన చేస్తోంది.

ఈ సందర్భంగా కెల్లీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు అంతరిక్షంలో ప్రయాణించినది కేవలం కొంత మంది మాత్రమే. వారిలో మహిళలు అది అమ్మలు వెళ్లడం చాలా అరుదు. అలాంటి వారిలో నేను భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని,తను ఈ పరిశోధనకు ఒప్పు కోవడం ద్వారా మరెంతోమంది పరిశోధకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా కెల్లీ గెరార్డి తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago