మనసులో ఏం అనుకుంటే.. అది స్క్రీన్ పై కనిపిస్తుంది.. అదెలా అంటే..?

కొంతమందికి పుట్టుకతోనే మాటలు రాకుండా పుడతారు. మరి కొంత మందికి అనుకోని ప్రమాదాల వల్ల నోటి నుంచి మాటలు రాకుండా ఉంటాయి. అయితే వాళ్లు ఏం మాట్లాడేది ఎదుటి వారికి అర్థం కాదు. వాళ్ల కంటూ ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు కూడా ఉన్న విషయం తెలిసిందే. వాళ్లకంటూ ప్రత్యేకంగా కొంత టెక్నాలజీని ఉపయోగించి వారికి అర్థం అయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధిస్తారు.

ఇలా మాటలు రాని వారి వ్యథ ఎవరికీ చెప్పలేక.. వాళ్లల్లో వాళ్లే కుమిలిపోతుంటారు. దీంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్న వారు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ టెక్నాలజీని రూపొందించారు అమెరికా శాస్త్రవేత్తలు. అందేంటంట.. ‘స్పీచ్‌ న్యూరోప్రోస్థెసిస్‌’. దీనిని ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఈ టెక్నాలజీ ద్వారా ముఖ్యంగా పక్షవాతం బారిన పడి మాటలను కోల్పోయిన వారికి మారియు .. పుట్టుకతోనే మాటలు రాని వారి మెదడులో సంకేతాలను మాటలుగా మారుస్తుంది. వారి మెదడు ఏం అనుకుంటుందో.. వాటిని స్క్రీన్ పై కనిపించేలా చేస్తుంది. దీనిని వారు దాదాపు పది సంవత్సరాలకు పైగా శ్రమించి అభివృద్ధి చేశారు.

ఈ టెక్నాలజీ చాలా బాగా పనిచేస్తుందని.. న్యూరోసర్జన్‌ ఎడ్వార్డ్‌ చాంగ్‌ పేర్కొన్నారు. దీని గురించి న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రచురించారు. ఇది ఒక అద్భుతం అని.. మెదడులోని పదాలను డీ కోడ్ చేసి.. మన కళ్ల ముందు కనిపించే స్క్రీన్ పై ఉంచడం అనేది గొప్ప ఆవిష్కరణ అని కొందరు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.