Movie News

కార్తీకదీపం రోషిణి గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా..?

బుల్లితెర స్టార్ మాలో అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటని చెప్పవచ్చు. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత, సౌందర్య పాత్రలకు ఎక్కువమంది అభిమానులు ఉంటారు. వీరందరి మధ్య ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ లోకి ఏసీపీ పాత్రలో జ్యోతి రెడ్డి రోషిణి పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

జ్యోతి రెడ్డి పలు సినిమాలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకున్న ఈమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఆగస్టు 4 1983 లో జ్యోతి రెడ్డి జన్మించారు. ఈమె తండ్రి బిఎస్ఎన్ ఉద్యోగి. ప్రస్తుతం మీరు హైదరాబాదులో నివాసముంటున్నారు. ఇకపోతే జ్యోతిరెడ్డి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి యశ్వంతో, అభిరాం అనే ఇద్దరు పిల్లలు కలరు. వీరి చిన్నబ్బాయి హైదరాబాద్లో చదువుతుండగా పెద్దబ్బాయి మలేషియాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు.

చిన్నప్పటి నుంచి డాన్స్ నటనపై ఎంతో ఆసక్తి ఉన్న జ్యోతి రెడ్డి తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ నేర్చుకుని సుమారు రెండు వందల స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది. ఈ విధంగా తన అద్భుతమైన నటన ద్వారా ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది. ఇక తన తల్లి ప్రోత్సాహం కారణంగానే బుల్లితెర పైకి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా దక్కించుకొని పలు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లు ఓ సందర్భంలో జ్యోతి రెడ్డి వెల్లడించారు. ఒకానొక సమయంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి “ఒకే ఒక్కడు” టీవీ సీరియల్ లో నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago