కొంతమందికి పుట్టుకతోనే మాటలు రాకుండా పుడతారు. మరి కొంత మందికి అనుకోని ప్రమాదాల వల్ల నోటి నుంచి మాటలు రాకుండా ఉంటాయి. అయితే వాళ్లు ఏం మాట్లాడేది ఎదుటి వారికి అర్థం కాదు. వాళ్ల కంటూ ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు కూడా ఉన్న విషయం తెలిసిందే. వాళ్లకంటూ ప్రత్యేకంగా కొంత టెక్నాలజీని ఉపయోగించి వారికి అర్థం అయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధిస్తారు.
ఇలా మాటలు రాని వారి వ్యథ ఎవరికీ చెప్పలేక.. వాళ్లల్లో వాళ్లే కుమిలిపోతుంటారు. దీంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్న వారు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ టెక్నాలజీని రూపొందించారు అమెరికా శాస్త్రవేత్తలు. అందేంటంట.. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’. దీనిని ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ టెక్నాలజీ ద్వారా ముఖ్యంగా పక్షవాతం బారిన పడి మాటలను కోల్పోయిన వారికి మారియు .. పుట్టుకతోనే మాటలు రాని వారి మెదడులో సంకేతాలను మాటలుగా మారుస్తుంది. వారి మెదడు ఏం అనుకుంటుందో.. వాటిని స్క్రీన్ పై కనిపించేలా చేస్తుంది. దీనిని వారు దాదాపు పది సంవత్సరాలకు పైగా శ్రమించి అభివృద్ధి చేశారు.
ఈ టెక్నాలజీ చాలా బాగా పనిచేస్తుందని.. న్యూరోసర్జన్ ఎడ్వార్డ్ చాంగ్ పేర్కొన్నారు. దీని గురించి న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించారు. ఇది ఒక అద్భుతం అని.. మెదడులోని పదాలను డీ కోడ్ చేసి.. మన కళ్ల ముందు కనిపించే స్క్రీన్ పై ఉంచడం అనేది గొప్ప ఆవిష్కరణ అని కొందరు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…