ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతల బయపెట్టిందో అందరికీ తెలుసు. గత ఏడాదిలో విజృంభించిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌.. ఇప్పుడు ప్రపంచ ఆదేశాలన్నింటికి పాకుతోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.

కోవిడ్-19 యొక్క వేరియంట్ లలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్ ఇదే అని “డబ్లూహెచ్‌ఓ” డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథ్నోమ్ ఘ్యాబ్రియోసిస్ చెప్పారు. ఈ మేరకు డబ్లూహెచ్ఓ సభ్య దేశాలన్నింటిని అలర్ట్ చేసింది. ఇది ప్రపంచం అంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.

కోవిడ్-19 లేదు.. కరోనా తగ్గిపోయింది అని ఎవరికి వాళ్ళు హీరోల లాగా నార్మల్ గా జీవనం సాగిస్తున్నారు, కానీ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోన్న ప్రకారం, ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది, ఇక నుండి అందరూ కరోనా వాక్సిన్ ల మీద మాత్రమే ఆధారపడకుండా సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ లు వాడటం, మాస్కులు ధరించడం తప్పక చేయాలని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ 77 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇది మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం చాలానే ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్ లో కూడా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్ల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇతర ముందు జాగ్రత చర్యలపై కూడా ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని కోరింది. ఒమిక్రాన్ ని తేలికగా తీసుకొని జాగ్రతలు పాటించకపోతే ప్రపంచ దేశాలు భారీమూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే కొన్ని దేశాలు 2 డోసుల వ్యాక్సిన్ తో పాటుగా ఒమిక్రాన్ ని ఎదుర్కొనటానికి బూస్టర్ డోసులని వేయడానికి సన్నద్దం చేశారు.