Tharun: తరుణ్ సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నారు.. కారణం ఏంటి..?

Tharun: తరుణ్ సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నారు.. కారణం ఏంటి..?

Tharun: తరుణ్… బాల నటుడిగా ఆకట్టుకుని హీరోగా ఎదిగిన నటుడు. కెరీర్ మొదట్లో వరస పెట్టి సాలిడ్ హిట్లు ఇచ్చిన తరుణ్ ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా తరణ్ పూర్తిగా సినిమాల వైపు చూడటం లేదు. ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులో తరుణ్ పేరు కూడా వినిపించింది.

Tharun: తరుణ్ సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నారు.. కారణం ఏంటి..?
Tharun: తరుణ్ సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నారు.. కారణం ఏంటి..?

అంతే తప్పితే  సినిమాల పరంగా అనుకున్నంతగా తరణ్ కెరీర్ సాగలేదనే చెప్పాలి.  కెరీర్ మొదట్లో హీరోగా తెరంగ్రేటం చేసిన ‘నువ్వేకావాలి’ సినిమా ఓ సంచలనం. అప్పటి పాటు ఆనాటి కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఏ నోట చూసినా.. నువ్వే కావాలి సాంగ్సే. అనగనగా ఆకాశంగా ఉంది.. సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Tharun: తరుణ్ సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నారు.. కారణం ఏంటి..?

ఏ ఊర్లో చూసినా.. ఈ పాటే వినిపించేలా మరుమోగింది ఈసాంగ్. దీంతో పాటు తరుణ్ పెర్ఫమెన్స్ చాలా బాగా కుదిరింది. దీంతో పాటు హీరోయిన్ రిచా కూడా చాలా బాగా నటించింది. దీంతో ఈ సినిమా సెన్సెషన్ హిట్ సాధించింది. దీంతో తరుణ్ కు లవర్ బాయ్ ముద్ర పడింది. 

నువ్వేకావాలి హిట్ తరువాత వరసగా.. నువ్వులేక నేను లేను, నువ్వే..నువ్వే వంటి హిట్లు ఇచ్చాడు. ఇలాంటి హిట్లు ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో స్టార్ గా మారాలి. అయితే అలాంటిది ఏది చోటు చేసుకోలేదు. చివరకు సినిమాలకు దూరం అయ్యాడు. ‘నువ్వే కావాలి’ (2000) నుంచి ‘శశిరేఖా పరిణయం’ (2009) వరకు తరుణ్ జోరుగా సినిమాలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన వేగం తగ్గింది. ‘శశిరేఖా పరిణయం’ నుంచి ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలు నాలుగంటే నాలుగే. తరుణ్ సినిమా (ఇది నా లవ్ స్టోరీ) వచ్చి నాలుగేళ్లు అవుతోంది.  


ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నా..

అయితే సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ స్టార్ ఇమేజ్ ను ఇవ్వదనేది తెలిసిందే. మాస్ హీరోగా ఎలివేట్ అయితేనే ఇండస్ట్రీలో మనుగడ సాధ్యం అవుతుంది. అయితే తరుణ్ విషయంలో ఇదే మిస్ అయింది. తరుణ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి స్టార్ గా ఎదిగాడు. తరుణ్ కు ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నా.. సినిమా అవకాశాలు రావడం లేదు. దీనికి తోడు తెరపైకి కొత్తకొత్త హీరోలు వస్తున్నారు. పాత తరం మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అవుతోంది. అయితే తరణ్ ని అభిమానించే వారు ఇంకా ఉన్నారు. వారి కోసం అయినా మళ్లీ సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఈరోజు తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా మంచి సినిమాలతో కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నారు.