Featured

Tanikella Bharani: చంపేస్తానని బెదిరించారు.. ఆవేదన వ్యక్తం చేసిన తనికెళ్లభరణి..!

Tanikella Bharani: తనికెళ్ల భరణి తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన వ్యక్తుల్లో ఒకరు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరోవైపు మాటల రచయితగా తెలుగు సినిమాకు సేవ చేస్తూనే ఉన్నారు.

Tanikella Bharani: అలా నటించినందుకు చంపేస్తామని బెదిరించారు…ఆవేదన వ్యక్తం చేసిన తనికెళ్లభరణి..!

గొప్ప శివ భక్తుడు తనికెళ్ల భరణి. శివతత్వం గురించి చెబుతున్నప్పుడూ వినకుండా ఉండలేము. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన విలనీ పాత్రలు తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. దీని వల్ల ఎన్ని ఇబ్బందులకు గురయ్యాననే విషయాలను వెల్లడించారు. 

తనికెళ్ల భరణి.. ‘మాతృదేవోభవ’, ‘ఆమె’ సినిమాల్లో చేసిన విలన్ క్యారెక్టర్లు చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె చిత్రంలో చేసిన క్యారెక్టర్ తెలుగు మహిళల్లో ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఎంతగా అంటే తనికెళ్ల భరణిని తిట్టడంతో పాటు ఏకంగా కొట్టే స్థితికి చేరింది. ఆమె సినిమా హీరోయిన్ ఊహను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు.

Tanikella Bharani: అలా నటించినందుకు చంపేస్తామని బెదిరించారు…ఆవేదన వ్యక్తం చేసిన తనికెళ్లభరణి..!

ప్రజల నుంచి విమర్శలు కూడా..

ఈ  సినిమా విడుదలైన తర్వాత తనికెళ్ల భరణి నటనకు మంచి పేరు వచ్చింది. ఇది అటుంచితే.. ప్రజల నుంచి విమర్శలు కూడా వెళ్లువెత్తాయి. అలీతో జాలీగా ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి ఈ సంగతిని వెల్లడించారు. సినిమా విడుదల అనంతరం బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి ప్రయత్నించారని… చాలా మంది మహిళలు తనను చంపెస్తామని బెదిరించారని తనికెళ్ల భరణి చెప్పాడు. ఇది అంతా సినిమా అమ్మ.. నిజం కాదు అన్నా కూడా చాలా మంది ఈ క్యారెక్టర్ ను జీర్ణించుకోలేకపోయారు. సినిమాలో చేసింది అంతా నిజం అనుకునేలా ఈ క్యారెక్టర్లు జనాల మదిలో రిజిస్టర్ అయ్యాయని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీ స్నేహితులతో కెరీర్ ఆరంభంలో  మందేయడంలో తాను ముందుండే వాడినని కూడా తెలిపాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago