Tanikella Bharani: తనికెళ్ల భరణి తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన వ్యక్తుల్లో ఒకరు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరోవైపు మాటల రచయితగా తెలుగు సినిమాకు సేవ చేస్తూనే ఉన్నారు.

గొప్ప శివ భక్తుడు తనికెళ్ల భరణి. శివతత్వం గురించి చెబుతున్నప్పుడూ వినకుండా ఉండలేము. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన విలనీ పాత్రలు తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. దీని వల్ల ఎన్ని ఇబ్బందులకు గురయ్యాననే విషయాలను వెల్లడించారు.
తనికెళ్ల భరణి.. ‘మాతృదేవోభవ’, ‘ఆమె’ సినిమాల్లో చేసిన విలన్ క్యారెక్టర్లు చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె చిత్రంలో చేసిన క్యారెక్టర్ తెలుగు మహిళల్లో ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఎంతగా అంటే తనికెళ్ల భరణిని తిట్టడంతో పాటు ఏకంగా కొట్టే స్థితికి చేరింది. ఆమె సినిమా హీరోయిన్ ఊహను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు.

ప్రజల నుంచి విమర్శలు కూడా..
ఈ సినిమా విడుదలైన తర్వాత తనికెళ్ల భరణి నటనకు మంచి పేరు వచ్చింది. ఇది అటుంచితే.. ప్రజల నుంచి విమర్శలు కూడా వెళ్లువెత్తాయి. అలీతో జాలీగా ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి ఈ సంగతిని వెల్లడించారు. సినిమా విడుదల అనంతరం బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి ప్రయత్నించారని… చాలా మంది మహిళలు తనను చంపెస్తామని బెదిరించారని తనికెళ్ల భరణి చెప్పాడు. ఇది అంతా సినిమా అమ్మ.. నిజం కాదు అన్నా కూడా చాలా మంది ఈ క్యారెక్టర్ ను జీర్ణించుకోలేకపోయారు. సినిమాలో చేసింది అంతా నిజం అనుకునేలా ఈ క్యారెక్టర్లు జనాల మదిలో రిజిస్టర్ అయ్యాయని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీ స్నేహితులతో కెరీర్ ఆరంభంలో మందేయడంలో తాను ముందుండే వాడినని కూడా తెలిపాడు.




























