అఫ్గానిస్తాన్‌లో చెస్ బ్యాన్ నిజమేనా… అలా చేయడానికి కారణం ఏంటి..?

ప్రపంచంలో చెస్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలను కూడా నిర్వహిస్తుంటారు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ అధికారులు. అయితే ప్రస్తుతం అప్ఘనిస్తాన్ లో 64 మంది చెస్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఇక నుంచి చెస్ ఆడటానికి వీళ్లేదని తాలిబన్లు హుకుం జారీ చేసినట్లు సమాచారం.

మొదటి నుంచి కూడా తాలిబన్లకు ఆ ఆట అంటే ఇష్టం ఉండదు. దాని వల్ల ప్రజలు దేవుడికి దూరం అవుతారనే నమ్మకం తాలాబన్లకు ఉంటుంది. దీంతో చెస్ ను బ్యాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో కూడా ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడుతుండగా.. వాళ్లను చుట్టుముట్టిన తాలిబన్లు రెండు రోజుల పాటు జైల్లో ఉంచి నరకం చూపించారు.

గత పాలనలో కూడా చెస్ ఆటను వాళ్లు నిషేధించారు. అయితే అఫ్ఘాన్ లో క్రికెట్ ఆటగాళ్లకు ప్రపంచంలో చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే తాలిబన్లు క్రికెట్ విషయంలో సానుకూలంగా స్పందించారు. వారు అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడేందుకు అవకాశాన్ని కల్పించారు.

అనూహ్యంగా వాళ్లు దీనికి మద్దతు పలకడంతో వేరే క్రీడలకు కూడా ఉంటుందని అందరూ భావించారు. కానీ చెస్ పై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. వాళ్లు చెస్ ఆడటం వల్ల ప్రజలు సైతాను బిడ్డలుగా మారిపోతారని.. వాళ్లు దేవుడి నుంచి దూరమైపోతారని తాలిబన్లు విశ్వసిస్తున్నారు. అందుకే ముందు నుంచి వారికి ఆ ఆటపై తీవ్రమైన ద్వేషం ఉన్నట్లు తెలుస్తోంది.