ప్రస్తుతం బంగారానికి ఎంత రేటు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్లు బంగారం పెట్టుబడి పెట్టి.. అవసరం ఉన్నప్పుడు విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు బంగారాన్ని తయారు చేసేందుకు.. బంగారం తయారు చేసే కులస్తులకు ఇచ్చి వాటికి కూలీ ఇచ్చి కస్టమర్లకు ఇచ్చేవారు వ్యాపారస్తులు. అయితే ఇలాగే ఓ వ్యక్తికి బంగారు ఆభరణాలు తయారు చేయాలని 10 కేజీల బంగారాన్ని ఇచ్చారు వ్యాపారస్తులు.
అంత బంగారాన్ని చూసిన సదరు వ్యక్తి ఆశ పుట్టిందో .. లేక మరేదైనా కారణం కావావచ్చో ఏమో గానీ ఇంట్లో ఓ లేఖ పెట్టి 10 కేజీల బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఈ విధంగా చెప్పారు. ఈ ఘటనపై తొమ్మిది మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఓ లెటర్ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది. విజయవాడ బస్టాండ్ లో బంగారంతో ఉన్న బ్యాగ్ పోయిందని అందులో రాసి అతడు ఇంట్లో నుంచి పరారయ్యాడు. అయితే ఈ లేఖపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అతడే బంగారాన్ని తీసుకొని పారిపోయి కేసును తప్పదోవ పట్టించేందుకే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారయిన వ్యక్తి పేరు దిలీప్ కుమార్ గా పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…