ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా.. ఈ 4 చిట్కాలు వాడండి..!

వయసు పెరిగే కొద్దీ.. ముఖంపై ముడతలు రావడం సహజం. అంతేకాదు ప్రస్తుతం వాతావరణం తీవ్ర కలుషితం అయిపోయింది. గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో జనాలు కూడా అనేక రోగాలకు గురవుతున్నారు. గాలిలో వివిధ రకాల విష పదర్థాలు కలిసిపోతాయి. అవి మన చర్మం మీద పడ్డాయంటే.. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

ముఖంపై ముడతలు రావడానికి ప్రధాన కారణం యవ్వనం నుంచి వయస్సు పెరగడమే. చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల కూడా ముఖంపై ముడతలు కారణమవుతోందని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు.

అయితే వీటిని తగ్గించేందుకు మార్కెట్లోకి యాంటీ ఎజెనింగ్ పేరిట క్రీములు వచ్చేస్తున్నాయి. వాటి ఖరీదు కూడా భారీగానే ఉంటుంది. అయితే.. ఇవేమీ లేకుండా సహజంగా కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. చర్మం యవ్వనంగా మెరిసిపోతారు.

నీటిని గోరు వెచ్చగా చేసుకొని.. ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి నాలుగు చుక్కల నిమ్మరం రాయాలి. అలా అరగంట ఆరనిచ్చి.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతీ రోజు చేస్తే ఫలితం కనపడుతుంది.

ముడుతలు తగ్గి.. ముఖం కాంతివంతంగా ఉండాలంటే.. ఆలివ్ ఆయిల్ ను ముఖంపై మర్దన్ చేయాలి. ఇదే కాకుండా.. బీట్ రూట్ , క్యారెట్ జ్యూస్ లను తాగితే ఫలితాలు మెరుగ్గా వస్తాయి.

అరటి గుజ్జు లేదా బొప్పాయి (బాగా పండింది) ముఖంపై రాసి.. కొన్ని నిమిషాల వరకు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా ముఖం కడుక్కోవాలి. ఇలా ప్రతీ రోజు చేస్తే ముఖం పై ముడతలు లేకుండా ఎంతో కాంతవంతంగా వెలిగిపోతుంది.