వయస్సు మీద పడుతున్నా కొద్ది ఎవరికైనా తెల్ల జుట్టు రావడం అనేది సహజం. కానీ కొంతమందికి వయస్సుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల లోపు వాళ్లకు కూడా అక్కడక్కడా తెల్ల జుట్టు కనిపిస్తుంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే.. సరైన జీవన విధానం లేక పోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేక పోవడం. అయితే దానిని మనం చాలావరకు ‘బాలనెరుపు’ అని అంటాం.
ఇలా చాలామంది తెల్ల జుట్టు వస్తుందని బాధపడుతుంటారు. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు కొన్ని కలర్ షాంపులు వాడి వాటని నల్లగా మారుస్తారు. అవి ఎంతో కాలం ఉండవు. వాటి కోసం కొన్ని చిట్కాలను చూద్దాం.
తెల్లజుట్టు ఉన్న వాల్లు హాని కరమైన ప్రొడక్ట్స్ అస్సలు వాడకూడదు. వాటి వల్ల తెల్ల జుట్టు పోవడం ఏమో గానీ.. ఉన్న జుట్లు ఊడిపోయే ప్రమాదం ఉటుంది.
కొన్ని ఉసిరి ఆకులను తీసుకొని జ్యూస్ చేయాలి. బృంగరాజ్ ఆకులని కూడా తీసుకుని ఆ జ్యూస్ లో కలపాలి. అందులోనే తులసి ఆకులను కలపాలి. వాటిని అన్నింటిని కలిపి జుట్టుకు పట్టిస్తే.. తెల్ల జుట్టు కనిపించదు.
కరివేపాకు కూడా జుట్టుని నల్లగా మారుస్తుంది. కావాలంటే మీరు కరివేపాకుతో నూనె చేసుకొని కూడా వాడచ్చు. నువ్వుల నూనె, మెంతుల పౌడర్‌ని కలిపి తలకు మసాజ్ చేసి… అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెలనిన్ కారణంగానే జట్టు రంగు మారుతుంటుంది. మెలనిన్ ఉత్పత్తి అనేది వయస్సు పెరిగే కొద్ది తగ్గుతుంది. అందుకే జుట్టు తెల్లగా మారుతుంది. మెలనిన్ ఉత్పత్తి పెంచుకోవడానికి చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు.జన్యూపరంగా జుట్టు తెల్లడడితే పైన చెప్పిన చిట్కాలు విజయవంతం కాకపోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…