Featured

‘అన్నమో రావణా’.. తీవ్ర ఆహార సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలు రూ.1195

పురాణాల్లో రామాయణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో శ్రీలంకను రావణుడు పాలించినట్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ప్రస్తుతం రావణుడేలిన ఆనాటి బంగారు రాజ్యంలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయి.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తున్నారు. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నాలుగువైపులా నీటితో కప్పబడి ఉన్న ప్రాంతాన్ని ద్వీపం అంటాం. శ్రీలంక చుట్టూ కూడా మొత్తం నీటితోనే ఉంటుంది.

అందుకే శ్రీలంక దేశాన్ని ద్వీప దేశం అంటారు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసర పదర్థాల ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో అక్కడ కిలో పాల ప్యాకెట్ ధర దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ.1195గా ఉంది. అంతేకాకుండా అక్కడ వంట గ్యాస్ ధర కూడా ఏకంగా 90 శాతం పెరిగి రూ.2,657కు వచ్చింది.

అంతకు ముందు రూ.1400 ఉండేది. అంటే దాదాపు రూ.1257 పెరిగింది. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వ నిషేధం విధించడంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర ప్రభావం పడింది.

ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

2 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

3 hours ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

3 hours ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

3 hours ago

వెంకీ కెరీర్ మార్చిన సినిమా.. సిరివెన్నెల ఆసక్తికర విశ్లేషణ

తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…

3 hours ago

అండమాన్ సముద్రంలో విషాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…

3 hours ago