మొదటి నుంచి ఎంతో వివాదాలతో.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎట్టకేలకు మా ఎన్నికలు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూసుకెళ్లింది. తర్వాత మంచు విష్ణు ప్యానెల్ దూసుకెళ్లింది.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఈసీ మెంబర్ గా ఉన్నా యాంకర్ అనసూయ గెలిచినట్లు ప్రకటించారు. తర్వాత ఎవరు ఎన్నికల్లో గెలిచారు అనే దానిపై అధికారులు జాబితా రిలీజ్ చేశారు. అందులో అనసూయ పేరు లేకపోవడం గమనార్హం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. ఆమె ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించింది. ‘‘క్షమించాలి .. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది ..
మీతో పంచుకుంటున్న ఏమనుకోవొద్దే ..! నిన్నా “అత్యధిక మెజారిటీ” “భారీ మెజారిటీ” నుండి గెలుపు అని చెప్పిన వారు.. ఈరోజు “ఓడిపోయింది” “ఓటమి” అంటున్నారు .. రాత్రికి రాత్రి ఎంజరుగుంటుందబ్బా.. అంటూ అనసూయ ట్వీట్ చేశారు. ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి.. ? అంటూ వరుస ట్వీట్లు చేసింది.
ఉన్న 900 మంది ఓటర్లలో 600 మంది ఓట్లు వేశారు. వాటిని లెక్కించడానికి రెండో రోజు కూడా పట్టిందా..? ఇలా ఎందుకు టైం పట్టినట్లు అర్థం గాక అడుతుతున్నా అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…