Writer & actor Tanikella Bharani : త్రివిక్రమ్ వల్ల రైటర్స్ అందరికీ ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెరిగింది… అప్పట్లో మాకు ఎంత ఇచ్చేవారంటే…: తనికెళ్ళ భరణి

Writer & actor Tanikella Bharani : తెలుగు సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గాను అలాగే విలన్ గాను కమెడియన్ గాను సహాయక పాత్రలకు అలాగే డైరెక్టర్ గాను ఇలా అన్నింటా తానేంటో నిరూపించుకుని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తనికెళ్ళ భరణి. ఆయన ఎన్నో సినిమాల్లో నటిస్తూనే మరోవైపు శివుడి మీద భక్తి పాటలను రాసి కొన్నింటిని పాడారు కూడా. అలా అన్నింటా తన ప్రతిభను చాటుకున్న తనికెళ్ళ భరణి గారు తన చిన్నతనం అలాగే సినిమా రంగంలోకి వెళ్ళకముందు తన జీవితం గురించి మాట్లాడారు.

త్రివిక్రమ్ వల్లే రైటర్స్ కి పెరిగింది…

రైటర్స్ గా ఉంటూ సినిమాల్లో నటిస్తూ మరోవైపు దర్శకత్వం కూడా వహించి సినిమాలను తీసిన వారిలో తనికెళ్ళ భరణి ఒకరు. అతే రైటర్ గా ఉంటున్న సమయంలో ఆయన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ అప్పట్లో ఐదు వేలు ఇచ్చేవారని, నోటు కాగితాల కంటే తెల్ల కాగితాలు ఎక్కువగా ఇచ్చేవారని, తనకే కాదు అప్పట్లో అందరు రైటర్ల పరిస్థితి అంతే అంటూ చెప్పారు.

అయితే తాను అంతకుముందు చేస్తున్న పనిలో వచ్చే జీతం కన్నా ఈ డబ్బు ఎక్కువ అంటూ చెప్పారు. పరుచూరి సోదరులు రైటర్ కి స్టార్ డమ్ తీసుకువస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ వలన డైరెక్టర్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళిందంటూ చెప్పారు. త్రివిక్రమ్, చిన్ని కృష్ణ వంటి వారు రైటర్స్ అయ్యాకే రైటర్స్ కి రెమ్యూనరేషన్స్ పెరిగాయని చెప్పారు.