Writer and Director Kanagala Jayakumar : డివి నరసరాజు తో రామోజీ రావు సినిమా ఎందుకు వద్దన్నాడంటే…: రైటర్ మరియు డైరెక్టర్ కనగాల జయకుమార్

Writer and Director Kanagala Jayakumar : డివి నరసరాజు గాటు ‘పెద్దమనుషులు’ చిత్రానికి రైటర్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన ఆయన గుండమ్మ కథ, దొంగ రాముడు, యమగోల వంటి సినిమాలకు కథలను అందించిన గొప్ప రైటర్. ఆయన తాను సినిమాలకు పనిచేసే సమయంలో ముఖ్యంగా డైరెక్టర్, నిర్మాత ఎవరు అనేది చూసి వారికి ఎంత సినిమా చేయడం మీద మక్కువ ఉందో తెలుసుకుని కథ అందించేవారు లేదా రచన సహకారం అందించేవారు. ఇక ఆయన సినిమా విశేషాలను గూర్చి రైటర్ మరియు దర్శకుడైన కనగాల జయకుమార్ తెలిపారు.

రామోజీరావు గారు సినిమా వద్దన్నారు… చివరికి సూపర్ హిట్…

డివి నరసరాజు గారు సాంఘిక పౌరానిక చిత్రాలకు కథ అందియ్యడంలో దిట్ట. ఆయన రైటర్స్ కే రైటర్ అంటూ గొల్లపూడి మారుతీ రావు వంటివారు ప్రశంసించేవారు అంటూ కనగాల జయకుమార్ తెలిపారు. ఇక ఆయన ఇంగ్లీష్ సినిమా ఆధారంగా తెలుగులో ‘కారు దిద్దిన కాపురం’ సినిమాను రామోజీరావు గారి నిర్మాణంలో తీశారు. అయితే మొదట దర్శకుడిగా మలయాళం సినిమాలు తీసే విన్సెంట్ గారితో చేయగా ఒక షెడ్యూల్ అయ్యాక రష్ చూస్తే అది నరసరాజు గారికి రామోజీరావు గారికి నచ్చలేదట.

దాంతో రామోజీరావు గారు ప్రొడ్యూసర్ గా సినిమా కథ చెప్పినపుడు నచ్చినట్లు, చూస్తే నచ్చడం లేదు ఇక్కడితో ఆపేద్దాం ఈ సినిమా అని చెప్పారట. అయితే నరసరాజు గారు కథ చాలా బాగుంది మారిస్తే చాలా బాగా వస్తుంది అంటే మీరు డైరెక్షన్ చేస్తారా అని రామోజీరావు అడిగారట. ఇక నరసరాజు గారు ఒప్పుకోవడం మొదటి షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ మొదటి నుండి షూటింగ్ చేసి సినిమా తీశారట. అలా నరసరాజు గారి డైరెక్షన్ లో వచ్చిన కారు దిద్దిన కాపురం సినిమా సూపర్ హిట్ అయింది అంటూ కనగాల జయకుమార్ తెలిపారు.