Writer & Director Kanagala Jayakumar : రమ్య కృష్ణ ను తెలుగులో పరిచయం చేసింది నేనే… సీతను తెమ్మంటే పీతను తెచ్చావా అంటూ రవిరాజా విసుకున్నారు…: డైరెక్టర్ మరియు రైటర్ కనగల జయకుమార్

Writer & Director Kanagala Jayakumar : ఒక్కప్పటి గ్లామర్ హీరోయిన్ ఇప్పటి శివగామి పేరు చెప్పక్కర్లేదు అందరికి ఓ నీలంబరి, ఓ శివగామి అనగానే గుర్తొచ్చేది రమ్య కృష్ణనే. తొంబై లలో అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన రమ్య ‘కృష్ణ లీలలు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక సంకీర్తన వంటి సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చిన అవకాశలు మాత్రం అంతంత మాత్రమే. రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ అయింది మాత్రం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన అల్లుడుగారు సినిమాతో. ఆ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు రమ్యకృష్ణ. అయితే మందరికి రమ్యకృష్ణ గా సుపరిచితురాలైన ఆమె అసలు పేరు రమ్య కృష్ణన్. ఇక ఆమె కెరీర్ గురించి విశేషాలను రైటర్ అలాగే డైరెక్టర్ అయిన కనగాల జయకుమార్ తెలిపారు.

రమ్య కృష్ణ ను తెలుగులో పరిచయం చేసింది నేనే….

సీనియర్ ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమ రావు గారి అబ్బాయి కల్యాణ చక్రవర్తి హీరోగా ఒక సినిమా తీయాలని త్రివిక్రమ రావు గారు హిందీ సినిమా రీమేక్ హక్కులను తీసుకుని ఆ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్టర్ గా తీయించారు. ఆ సినిమానే కృష్ణ లీలలు. ఆ సినిమాకు రవి రాజ పినిశెట్టి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జయకుమార్ గారు హీరోయిన్ వేటలో అప్పట్లో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సీతను రవిరాజా గారు తీసుకురమ్మంటే జయకుమార్ గారు ఆమె కోసం షూటింగ్ స్పాట్ కి వెళ్లి రమ్య కృష్ణ ని చూసి రమ్య కృష్ణ ను తీసుకువచ్చారట. రవిరాజా గారు జయకుమార్ గారిని సీతను తీసుకురమ్మంటే పీతను తెచ్చావెంటి అంటూ అడిగారట.

ఇపుడైతే షూటింగ్ కాదు కదా చూస్తారని పిలుచుకుని వచ్చాను నచ్చితే పెట్టుకుందాం లేకుంటే లేదు అని చెప్పారట. ఇక నిర్మాతలైన నాగేశ్వరావు, సూరిబాబు అనే వ్యక్తులకు ఆమె నచ్చడం డైరెక్టర్ ను ఒప్పించి కృష్ణ లీలలు సినిమాలో ఓకే చేశారట. అలా రమ్య కృష్ణ మొదటి తెలుగు సినిమా కృష్ణ లీలలు లో హీరోయిన్ గా కళ్యాణ్ చక్రవర్తి సరసన నటించిందని ఇక ఆపైన రవిరాజా పినిశెట్టి చాలా సినిమాల్లో ఆమెను రిపీట్ చేసారని రాఘవేంధ్ర రావు సినిమాల్తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిందని జయకుమార్ తెలిపారు.