Yashoda Movie: వరల్డ్ వైడ్ యశోద 11 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించిన యశోద!

Yashoda Movie:టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత మొదటిసారి యశోద అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరి హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిసారి సమంత పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో సమంత నటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిన.మొదటివారం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించిన ఈ సినిమా రెండవ వారం కృష్ణగారి మరణంతో కొంతమేర కలెక్షన్లు తగ్గాయి. ప్రస్తుత ఈ సినిమా తిరిగి మంచి కలెక్షన్లను అందుకొని 11 రోజులకు బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 రోజులలో ఏ ఏ ప్రాంతంలో ఎంత కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తే…

నైజం 4.02 కోట్లు, సీడెడ్ 0.77 కోట్లు, ఉత్తరాంధ్ర 1.10 కోట్లు, ఈస్ట్ 0.49, వెస్ట్ 0.30, గుంటూరు 0.50, కృష్ణ 0.54, నెల్లూరు 0.25, ఏపీ, తెలంగాణ 7.97, తమిళనాడు 1. 20, హిందీ 0.57, ఓవర్సీస్ 2.68, రెస్ట్ 0.62 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ విధంగా ఈ సినిమా 11 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 13.04 కోట్ల షేర్స్ రాబట్టింది.

బయ్యర్లకు లాభాలు తెచ్చిన యశోద…
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 11.5 షేర్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా 11 రోజులకు గాను 13. 04 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, బయ్యర్లకు ఈ సినిమా 1.54 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.ఇక ముందు ముందు వచ్చే కలెక్షన్లన్నీ కూడా బయ్యర్లకు లాభాలు అనే చెప్పాలి.మొత్తానికి యశోద సినిమా 10 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.