యువ జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య.. ఎమోషనల్ అయిన సోనూ సూద్!

మార్చిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నుండి జర్మన్ రైఫిల్ అందుకున్న జాతీయ షూటర్ కొనికా లాయక్(26) గురువారం (డిసెంబర్ 16) ఆత్మహత్య చేసుకున్నారు. షూటింగ్ కమ్యూనిటీలో ఆత్మహత్యలు చేసుకోవడం.. ఈమెతో నాలుగోది. ఈ వార్త జాతీయ షూటింగ్ సోదర వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

హౌరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె వద్ద ఒక సూసైడ్ నోట్ దొరికిందని.. అందులో ఆమె తన చావుకు కారణం తెలపలేదని చెప్పారు. కానీ.. ఈ చర్యకు పాప్పడటానికి కారణం “డిప్రెషన్” అని ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు తెలిపారు పోలీసులు. అవకాశాలు రాకపోవడంతో ఆమె నిరాశకు లోనైందని.. ఆమె ఆ నోట్ లో రాసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో కోనికాకు ఆమె కష్టాల గురించి వివరించిన తర్వాత నటుడు సోనూ సూద్ జర్మన్-తయారీ చేసిన రైఫిల్‌ను బహుమతిగా ఇచ్చారు. తద్వారా ఆమె నేషనల్స్ , ఇతర పోటీలలో పాల్గొంటుంది. కోనికా ప్రస్తుతం కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్‌తో శిక్షణ పొందుతోంది. ఇలా అకస్మాత్తుగా ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకొని కనిపించడంతో ఆ ప్రాతమంతా కలకలం రేపింది.

ఇలా గడిచిన నాలుగు నెలల్లో ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఈమెతో నలుగురు. పిస్టల్ షూటర్ ఖుషీరత్ కౌర్ సంధు షూటింగ్ నేషనల్స్‌లో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత రాష్ట్ర స్థాయి షూటర్ హునర్‌దీప్ సింగ్ సోహల్ , మొహాలీకి చెందిన నమన్‌వీర్ సింగ్ బ్రార్ కూడా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఔత్సాహిక షూటర్లు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడటం కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.