మార్చిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నుండి జర్మన్ రైఫిల్ అందుకున్న జాతీయ షూటర్ కొనికా లాయక్(26) గురువారం (డిసెంబర్ 16) ఆత్మహత్య చేసుకున్నారు. షూటింగ్ కమ్యూనిటీలో ఆత్మహత్యలు చేసుకోవడం.. ఈమెతో నాలుగోది. ఈ వార్త జాతీయ షూటింగ్ సోదర వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
హౌరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె వద్ద ఒక సూసైడ్ నోట్ దొరికిందని.. అందులో ఆమె తన చావుకు కారణం తెలపలేదని చెప్పారు. కానీ.. ఈ చర్యకు పాప్పడటానికి కారణం “డిప్రెషన్” అని ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు తెలిపారు పోలీసులు. అవకాశాలు రాకపోవడంతో ఆమె నిరాశకు లోనైందని.. ఆమె ఆ నోట్ లో రాసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో కోనికాకు ఆమె కష్టాల గురించి వివరించిన తర్వాత నటుడు సోనూ సూద్ జర్మన్-తయారీ చేసిన రైఫిల్‌ను బహుమతిగా ఇచ్చారు. తద్వారా ఆమె నేషనల్స్ , ఇతర పోటీలలో పాల్గొంటుంది. కోనికా ప్రస్తుతం కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్‌తో శిక్షణ పొందుతోంది. ఇలా అకస్మాత్తుగా ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకొని కనిపించడంతో ఆ ప్రాతమంతా కలకలం రేపింది.
ఇలా గడిచిన నాలుగు నెలల్లో ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఈమెతో నలుగురు. పిస్టల్ షూటర్ ఖుషీరత్ కౌర్ సంధు షూటింగ్ నేషనల్స్‌లో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత రాష్ట్ర స్థాయి షూటర్ హునర్‌దీప్ సింగ్ సోహల్ , మొహాలీకి చెందిన నమన్‌వీర్ సింగ్ బ్రార్ కూడా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఔత్సాహిక షూటర్లు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడటం కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…