YS Jagan: ఆ కారణంతోనే ఏపీ రాజధానిగా విశాఖను ప్రకటించాము: వైయస్ జగన్

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే .ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన జరగబోయే ఎన్నికల గురించి గత ఐదు సంవత్సరాల పాలన గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెర పైకి తీసుకువస్తారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి మాట్లాడుతూ తాను విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తానని అక్కడే ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. అయితే విశాఖను రాజధానిగా ప్రకటించడానికి కారణాలను కూడా తెలియజేశారు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలంటే ఒక ఎకరం మీద దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే అమరావతి అనేది గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక మన ఏపీలో విశాఖ అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో మన ఏపీకి విశాఖ అలాగా ఉంటుంది ఈ అభివృద్ధి చెందినటువంటి సిటీకి మనం కాస్త బూస్ట్ ఇస్తే ప్రస్తుతం ఒక హైదరాబాద్ బెంగళూర్ చెన్నై లాగా రూపుదిద్దుకుంటుందని ఆ ఒక్క కారణంతోనే తాను విశాఖను రాజధానిగా ప్రకటించానని జగన్ తెలిపారు.

అభివృద్ధి చెందిన నగరం..
ఇక ఈ ఐదు సంవత్సరాల కాలంలో తన పరిపాలన గురించి కూడా మాట్లాడారు తాను అధికారంలోకి రాకముందు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలను కల్పించాను కళ్ళముందే మన ఉద్యోగులందరూ కూడా కనపడుతున్నారని తెలిపారు. అలాగే జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా పూర్తిగా వివరించారు అభివృద్ధి జరగలేదన్న వారికి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగన్ క్లారిటీ ఇచ్చారు.