YS Jagan Mohan Reddy: ఏప్రిల్ నెలలో జగన్ మాజీ సీఎం అవుతారు.. చంద్రబాబు కామెంట్స్ వైరల్!

YS Jagan Mohan Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్లిపోతారు కానీ అమరావతి మాత్రం ఇక్కడే ఉంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ కే వాయిదా వేసిందన్నారు. నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్ లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరతాం. రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం పంచాయతీలు సర్పంచులకు కేటాయిస్తామని రానున్న ఐదు సంవత్సరాలలో 10% బడ్జెట్ కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇకపోతే తాము అధికారంలోకి వస్తే కనుక సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనం కూడా పెంచుతామని ఈయన వెల్లడించారు. ప్రజలు తమకు సేవ చేయాలని సర్పంచ్లను ఎన్నుకుంటే జగన్ మాత్రం వాలంటీర్లను ఎన్నుకున్నారని వాలంటీర్లు ప్రజలకు కాకుండా జగన్ కి సేవ చేస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు.

సీఎం పదవిపై జోస్యం చెప్పిన బాబు..

ఇక జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు ఉంటే మనపై పడితే మనం ఏం చేస్తాము ఇన్ని రోజులు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా తిరిగిన జగన్ చెల్లి షర్మిల ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వెళుతుంది. ఆయన తల్లి చెల్లి వ్యవహారాన్ని తాను చూసుకోకపోతే మాకేంటి సంబంధం అంటూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. ఏది ఏమైనా ఏప్రిల్ నెలకు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అవుతారంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.