Amalapaul: డస్కీ బ్యూటీ అమలాపాల్ రెండు నెలల క్రితం ప్రేమించిన వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు అయితే గోవాకు చెందినటువంటి ప్రముఖ బిజినెస్ మెన్ జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ఈమె నవంబర్ 5వ తేదీ రెండో వివాహం చేసుకున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.
అక్టోబర్ చివరి వారంలో తన ప్రియుడిని పరిచయం చేసి నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈమె నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి తర్వాత రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని రివీల్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మా జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అనే విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ అమలాపాల్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మూడో వ్యక్తి రాబోతున్నారు..
ఇలా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా మరికొంతమంది ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి జరిగి కూడా రెండు నెలలు పూర్తి కాలేదు అప్పుడే ప్రెగ్నెన్సీ ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…