వార్తల్లో హీరో వెంకటేష్ కూతురు దగ్గుబాటి ఆశ్రిత ….కారణం ఏంటో తెలుసా?

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో, కొన్ని సినిమాల్లో బిస్కట్ అనే పదం మనకు బాగా వినిపిస్తోంది. ఏదో సెటైరిక్‌గా ఈ పదాన్ని వాడుతున్నారు. కానీ వెంకీ కూతురు ఆశ్రిత గురించి ఇక్కడ చెప్పబోయేది అలాంటి విషయం మాత్రం కాదు. నిజంగానే వెంకటేష్ కూతురు బిస్కెట్ వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి బిస్కెట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.


ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముందే ఆశ్రిత అందుకు సంబంధించి ఇంటర్నేషనల్ కోర్స్ చేసినట్లు సమాచారం. ఆ ఇంట్రెస్టుతోనే… బేకరీ బిస్కట్స్ ఐటమ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కోర్స్ చేసిన ఆశ్రిత… ఈ రంగంపై ఇంట్రెస్టుతో ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఉండే బిస్కెట్స్, కుకీస్ తయారు చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ బిస్కెట్స్, కుకీస్ తయారీ మొదలు పెట్టారని, వాటిని నేరుగా ప్రజలకు, రిటైల్ ఔట్ లెట్స్ లో అమ్మేందుకు ఆశ్రిత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తను తయారు చేసిన బిస్కెట్స్ ప్రజలకు పరిచయం చేసేందుకు రామానాయుడు స్టూడియోలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.