ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో, కొన్ని సినిమాల్లో బిస్కట్ అనే పదం మనకు బాగా వినిపిస్తోంది. ఏదో సెటైరిక్‌గా ఈ పదాన్ని వాడుతున్నారు. కానీ వెంకీ కూతురు ఆశ్రిత గురించి ఇక్కడ చెప్పబోయేది అలాంటి విషయం మాత్రం కాదు. నిజంగానే వెంకటేష్ కూతురు బిస్కెట్ వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి బిస్కెట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముందే ఆశ్రిత అందుకు సంబంధించి ఇంటర్నేషనల్ కోర్స్ చేసినట్లు సమాచారం. ఆ ఇంట్రెస్టుతోనే… బేకరీ బిస్కట్స్ ఐటమ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కోర్స్ చేసిన ఆశ్రిత… ఈ రంగంపై ఇంట్రెస్టుతో ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఉండే బిస్కెట్స్, కుకీస్ తయారు చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ బిస్కెట్స్, కుకీస్ తయారీ మొదలు పెట్టారని, వాటిని నేరుగా ప్రజలకు, రిటైల్ ఔట్ లెట్స్ లో అమ్మేందుకు ఆశ్రిత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తను తయారు చేసిన బిస్కెట్స్ ప్రజలకు పరిచయం చేసేందుకు రామానాయుడు స్టూడియోలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…