అమెరికా చేతిలో వూహన్ ల్యాబ్ రహస్యాలు..! కలవర పడుతున్న చైనా..!

కోవిడ్-19 ఎలా పుట్టింది అనే దానిపై అనేక అనుమాలు ఉన్నాయి. అయితే మహమ్మారి చైనా లోని వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా మూలాలపై వూహన్ లోనే లీక్ అయిందనే అనుమానాలకు బలం చేకూర్చే ఆధారాలు ప్రతిరోజూ ఒకటి బయటకొస్తున్నాయి. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ అమెరికా నిఘా వర్గాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో తాజాగా, వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి కరోనా మహమ్మారి లీకయిందనడానికి పలు ఆధారాలు అమెరికా చేతికి చిక్కాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో చైనా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ప్లేటు ఫిరాయించి, అమెరికా పంచన చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆటను అందించిన అధారాలతోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 90 రోజుల్లోగా కోవిడ్ మూలాలపై సమగ్ర నివేదిక అందజేయాలని నిఘా వర్గాలను ఆదేశించారని సమాచారం. అయితే చైనా ఉన్నతాదికారి కనబడకుండా పోవడంపై చైనా కలవర పడుతున్నట్టు తెలుస్తుంది. అతడు అమెరికా పారిపోయాడనే ప్రచారం చైనాలో జరుగుతుంది.