Featured

ఆరియానా సెంటిమెంట్ తో ఆడుకుంటున్న సోహైల్.. సీరియస్ అయిన ఆరియనా..

బిగ్ బాస్ హౌస్ లో టామ్ అండ్ జెర్రీ ఎవరంటే అందరికి ఈజీగా తెలిసిపోతుంది. ఆరియానా, సోహైల్ వీరిద్దరూ ప్రతి విషయంలోనూ గొడవలే.. వీరిద్దరికీ ఏమాత్రం పడేది కాదు. అస్తమానూ తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేస్తూ ఉండేవారు. ఒక దశలో హోస్ట్ నాగార్జున వీరిద్దరి గొడవపై పెద్ద డిస్కషన్ కూడా పెట్టి సోహైల్ కి క్లాస్ తీసుకున్నాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఓకే కోతి బొమ్మ విషయంలో వీరిద్దరి మధ్య జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే.. దానికి ‘చింటూ’ అని ముద్దుగా నామకరణం చేసి ఏంతో ప్రేమగా చూసుకునేది ఆరియానా. అయితే ఒక టాస్క్ లో సోహైల్ ఆ బొమ్మను, స్విమ్మింగ్ పూల్ లోకి విసిరి వేశాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య భీకర వాగ్వాదమే జరిగింది. అయితే బిగ్ బాస్ ముగిసిపోయాక ఇద్దరూ హౌస్ లో గొడవలు అన్నీ పక్కనపెట్టి సన్నిహితంగా ఉంటున్నారు.

అయితే తాజగా మరో చిన్న వివాదం మొదలయింది వీరిద్దరి మధ్యలో.. అరియానా ఎంతగానో ఇష్టపడే చింటూ గాడిని తాజగా సోహైల్ కిడ్నాప్ చేశాడు. ‘హౌస్ లో నాకు ఉన్న బద్ద శత్రువు వీడు, వీడు హౌస్ లో నాకు మనశ్శాంతి లేకుండా చేసాడు. ఇప్పటికి చింటూ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చింటూ గాడిని అమ్మేస్తాను. ఎవరి మధ్య అయినా చిచ్చులు పెట్టాలనుకుంటే ఈ బొమ్మను కొనుక్కోండి’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు సోహైల్.

పవన్, రానా మూవీ నుండి మరో లేటెస్ట్ అప్డేట్ – Read More

మరో బిజినెస్ ప్లాన్ లో అడుగుపెట్టనున్న సమంత? – Read More..

ఇక ఈ పోస్ట్ చూసిన ఆరియానా తను ఎంతగానో ప్రేమించే చింటూ గాడిని అమ్మేస్తాను అని సోహైల్ అనడంతో.. సీరియస్ గా రియాక్ట్ అయ్యింది… ‘ఒరేయ్ అది అమ్మేది కాదు, నిన్ను చంపేస్తా’ అంటూ.. వార్నింగ్ ఇచ్చింది. తాజగా అరియానా, సోహైల్ ల మధ్య జరుగుతున్నా ఈ గొడవ ఆశక్తికరంగానే ఉన్నా.. దీని వెనుక ఉన్న అసలు విషయమేమిటో అర్థం కావడం లేదు.

ప్రస్తుతం సినిమాలో నటిస్తూ సోహైల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటువంటి సమయంలో అరియానా బొమ్మపై ప్రతీకారం అంటూ వీడియో చేయడంపై అంతర్యం అర్ధం కావడంలేదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక వీరిద్దరూ కలుస్తూ విందులు, వినోదాలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago