మరో బిజినెస్ ప్లాన్ లో అడుగుపెట్టనున్న సమంత?

0
362

టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత. ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సమంత హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా బాగా పేరు సంపాదించుకుంది. ఇక వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాలలో అవకాశం అందుకొని మంచి సక్సెస్ లను అందుకుంది.

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనేంటో నిరూపించుకుంది. ఎన్నో వాణిజ్యపరమైన ప్రకటనలలో చేసింది. అంతేకాకుండా తన భర్త నాగచైతన్యతో కూడా పలు ప్రకటనలలో చేసింది. ఇక ఫ్యాషన్ విషయంలోఎప్పుడు ట్రెండీగా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో కూడా గార్డెనింగ్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది.

ఇవన్నీ ఇలా ఉంటే బిజినెస్ పరంగా కూడా సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే పలు బిజినెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇక తన సొంత డిజైనింగ్ కంపెనీ సాకీ లో కూడా బాగా బిజీగా మారింది. పైగా వాటి డిజైన్స్ దుస్తులను ప్రమోట్ చేసేందుకు తానే స్వయంగా ఫోటో షూట్లు చేయించుకుంటుంది. ఇక ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్ ను కూడా నడుపుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యాపారంలోకి అడుగు పెడుతుంది సమంత. అది కూడా జ్యువెలరీ బిజినెస్ పై ఆలోచనలు చేస్తుందట. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో తెలపనున్నారు. మొత్తానికి అటు ఇండస్ట్రీలో ఇటు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న సమంత అక్కినేని కోడలు గా నాగార్జునకు మంచి గుర్తింపు అందిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్ బిజినెస్ రంగంలో అడుగులు పెట్టగా అందులో తమన్నా కూడా జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది. ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.