డెల్టా వేరియంట్స్ పై టీకాలు పనిచేస్తున్నయ్..

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. కొత్తరకాలు పుట్టుకురావడం వ్యాక్సిన్ల పనితీరుకు ఒక సవాలుగా మారింది. దీంతో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ సంస్థలు ఆయా వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యంపై అధ్యయనాలు మొదలుపెట్టాయి.

ఇందులో భాగంగా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు భావిస్తోన్న డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇక భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌లు కూడా డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది.