సరిగ్గా ఆయనకు నాలుగేళ్ల వయసు ఆనాటి ప్రముఖ రచయిత ఆత్రేయ రాసిన కప్పలు అనే నాటికలో ఓ వేషం ధరించాడు. అప్పటి నుంచి ప్రదీప్ కు నాటకాలు అంటే చాలా ఇష్టం. 1975లో ఎన్టీ రామారావు, జయప్రద హీరో, హీరోయిన్లుగా వచ్చిన అడవి రాముడు సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి మాటల రచయితగా జంధ్యాల పనిచేశారు. అలా.. ఒకరోజు ప్రదీప్ గారి మామయ్య ఇంటికి జంధ్యాల గారు వచ్చారు. తొమ్మిదేళ్ల వయస్సున్న ప్రదీప్.. NTరామారావును కల్పించమని అతనిని చూడాలని జంధ్యాలను అడగడం జరిగింది. కొన్ని సంవత్సరాలు ఆగితే నిన్నే హీరోగా పెట్టి ఎన్టీరామారావు సినిమాకి పోటీగా నీ సినిమా విడుదల చేస్తానని సరదాగా చెప్పడం జరిగింది.
ఒకసారి హైదరాబాద్ రవీంద్రభారతిలో ఓ చీకటి రాత్రి అనే నాటకం వేస్తుండగా ఆ నాటకానికి జంధ్యాలను గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఆ నాటకంలో ప్రదీప్ పాత్రను చూసి జంధ్యాల నా సినిమాలో హీరోగా నటిస్తావా అని అడిగారు. అలా ప్రదీప్, పూర్ణిమ హీరో, హీరోయిన్లుగా ‘ముద్దమందారం’ అనే రొమాంటిక్ సినిమా 1981లో విడుదలయింది. ‘ముద్దమందారం’ చిత్రం తో పాటు అందులోని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలివేలు ఆణి ముత్యమా… అనే ఫస్ట్ నైట్ సాంగ్ లో ప్రదీప్, పూర్ణిమల రొమాన్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇంకా సినిమాలోని పాటను తమ మొబైల్స్ లో రింగ్ టోన్ గా పెట్టుకొని వింటున్నారు. ఆ తర్వాత 1982 లో జంధ్యాల దర్శకత్వంలో నరేష్, తులసి, ప్రదీప్ పూర్ణిమలు హీరోహీరోయిన్లుగా నాలుగు స్తంభాలాట సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా 175 రోజులు ఆడడం జరిగింది.
తర్వాత 1983లో మళ్లీ జంధ్యాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, మహాలక్ష్మి హీరోహీరోయిన్లుగా ‘రెండు జెళ్ళ సీత’ విడుదలయింది. అలా కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తర్వాత బుల్లితెర హీరోగా మారి అనేక సీరియల్స్ నిర్మించి దర్శకత్వం వహించడం జరిగింది. ఆ తర్వాత 2019 లో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా మెహరీన్ హీరో హీరోయిన్లుగా ‘ఎఫ్ 2’ సినిమా లో అంతేగా అంతేగా అంటూ రెండు డైలాగ్స్ చెప్పే ప్రదీప్ సినిమా మొత్తం కనిపిస్తూ కడుపుబ్బ నవ్విస్తారు. ఇప్పటి జనరేషన్ కి ప్రదీప్ రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కనిపించాడు కానీ ఒకప్పుడు హీరోగా రొమాంటిక్ లవ్ సీన్స్ ఎలా మెప్పించాడో ఇప్పుడే అర్థం అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…