పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీ రావడానికి కారణం ఇదే !

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ సంచలనం. పాన్ ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఒక్కటి రాకపోయినా పవర్ స్టార్ రేంజ్ పాన్ ఇండియన్ స్టార్ రేంజే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ అలా చూస్తే చాలు ఫ్లాటైపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న క్రేజ్ అలాంటిది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. బయటకి చాలా సైలెంట్‌గా కనిపించే పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం పర్ఫార్మెన్స్, ఫైట్స్, డాన్స్ ..ఇలా ప్రతీదాంట్లో సత్తా చాటుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో జానీ లాంటి భారీ డిజాస్టర్స్ పడ్డాయి. అయినా ఆయన క్రేజ్ పెరిగిందే తప్ప రవ్వంత కూడా తగ్గింది లేదు. ఇక కొందరిలో ఎందుకు పవర్ స్టార్ కి ఇంత క్రేజ్…ఆయనలో ఏముంది స్పెషాలిటీ అని కామెంట్స్ చేస్తుంటారు. ఆ స్పెషాలిటో ఏంటో ఒక్కసారి ఆయన కెరీర్ ప్రారంభం చూసుకుంటే ఓ క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ప్రముఖ దర్శకుడు ఈవీవీ.సత్యనారాయణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1996 లో విడుదలయింది.

మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ భారీ హిట్ అందుకున్నాడు. డెబ్యూ మూవీతోనే స్టార్ అవుతాడని ఇండస్ట్రీ మొత్తం ఎంతో నమ్మకంగా చెప్పారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎస్.గోపాల్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి పనిచేయడం ఇక్కడ గొప్ప విషయం. ఇక చాలామందికి తెలియని సీక్రెట్ ఒకటుంది. పవన్ నటించిన డెబ్యూ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ అనే హిందీ సినిమాకు రీమేక్‌గా తెలుగులో నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి డెబ్యూ సినిమా అంటే ఓ కొత్త కథతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. కానీ ఈవీవీ సత్యనారాయణ మీద నమ్మంతో బాలీవుడ్ సినిమాను రీమేక్ చేశారు. ఆయన హిందీ, తమిళ రీమేక్స్‌ని తెలుగులో బాగా హ్యాండిల్ చేస్తారు. ఆ నమ్మకమే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తీసేందుకు అందరినీ ఒప్పించింది. సినిమా రిలీజ్ అయ్యాక మెగా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు, నాగార్జున మేన కోడలు, సుమంత్ చెల్లి సుప్రియ హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ సినిమాలతో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. తొలిప్రేమ సినిమా 250 రోజులకి పైగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రదర్శింపబడింది. ఇది పెద్ద ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత బద్రి, ఖుషీ సినిమాలు అదే స్థాయిలో హిట్ సాధించాయి. 1996లో ఇండస్ట్రీకి పరిచయం అయిన పవన్ కళ్యాణ్ 2001 వరకు 7 సినిమాలు చేశారు. ఈ 7 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఒక హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాక వరుసగా ఇన్ని హిట్స్ అందుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఇక పవన్ కళ్యాణ్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నవాళ్ళు ఇంకా తక్కువ. అందుకే ఆయన క్రేజ్ ఎప్పటికీ అసాధారణం.