మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు రామ్ చరణ్. హీరో కొడుకు హీరోనే అవుతాడు.. బిజినెస్ మెన్ కొడుకు బిజినెస్ మెన్ అవుతాడు.. అందరూ అనుకుంటారు కానీ.. ఏదైనా ఒక ఇంటస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ప్లాట్ ఫాం ఉండగానే సరిపోదు.. దాని కోసం ఎంతో కష్టపడాలి. అప్పుడే మనం ట్రాక్ మీద ఉంటాం. లేదంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఎక్కడైనా టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
మెగాస్టార్ చిరంజీవి కొడుకు అంటే ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ వేరు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు.. ఎప్పుడు హీరో అవుతారు అని మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూశారు. అయితే.. తనకు 16 ఏళ్లు వచ్చే వరకు అసలు హీరో అవ్వాలని కూడా అనుకోలేదట రామ్ చరణ్. నాకు 16 ఏళ్లు వచ్చే వరకు నాకు హీరో అవ్వాలి.. యాక్టర్ అవ్వాలి అని ఏనాడూ అనుకోలేదు. నాకు ఎక్కువగా కార్లు అంటే ఇష్టం. ఇంజినీరింగ్ అంటే ఇష్టం. మధ్యలో క్రికెట్ అంటే ఇష్టం ఏర్పడింది. కానీ.. ఏనాడూ హీరో అవ్వాలి.. నాన్న వారసుడిగా సినిమాల్లోకి రావాలి.. అని ఎప్పుడూ అనుకోలేదు.. అంటూ రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
చిరుత సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాకే డ్యాన్స్ చేయడం నేర్చుకున్నా
మెగాస్టార్ చిరంజీవి ఎలా డ్యాన్స్ చేస్తారో అందరికీ తెలుసు కదా. ఆయన లాగానే డ్యాన్స్ చేస్తూ.. టాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్సర్ గా నిలిచారు రామ్ చరణ్. అయితే.. రామ్ చరణ్ డ్యాన్స్ చూస్తే.. చిన్నప్పటి నుంచి రామ్ చరణ్.. డ్యాన్స్ నేర్చుకున్నారేమో అని అనుకుంటారు. కానీ.. చిరుత సినిమా సెట్ లోనే రామ్ చరణ్ డ్యాన్స్ చేయడం నేర్చుకున్నారట. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారట.
మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డా
రామ్ చరణ్.. తన మొత్తం సినిమాల్లో ఎక్కువగా మగధీర సినిమాకు కష్టపడ్డారట. అలాగే.. గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం కూడా బాగా హోమ్ వర్క్ చేశారట. నా సినిమా షూటింగ్ లో ఎక్కువగా నాన్న ప్రభావం ఉండకుండా చూసుకుంటా. డైరెక్టర్స్ కూడా నాన్న సీన్లను గుర్తు చేసినా.. నేను అవన్నీ గుర్తుంచుకోకుండా.. నాకు తెలిసిన నటన చేస్తుంటా.. అని రామ్ చరణ్ వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ అనే బిరుదు నాకు ఫ్యాన్స్ ఇచ్చిందే
చిరంజీవికి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు, రామ్ చరణ్ కు మెగా పవర్ స్టార్ అనే బిరుదు రావడంపై స్పందించిన రామ్ చరణ్.. తాము ఎప్పుడు కూడా బిరుదులు కావాలని కోరుకోమన్నారు రామ్ చరణ్. ఎందుకంటే.. అవన్నీ తమ ఫ్యాన్స్ పెట్టే బిరుదు మాత్రమే అని చెబుతున్నారు. వాళ్లే ఒక పేరు ఉండాలని నాకు మెగా పవర్ స్టార్ బిరుదు ఇచ్చారు.. అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…