Categories: FeaturedGeneral News

ఊయల ఊగుతూ..6300 లోయలో పడ్డారు.. కానీ చివరికి?

సాధారణంగా ఊయల ఊగాలి అంటే అందరూ ఎంతో సరదా పడతారు. కానీ అదే ఊయల కొండ అంచు ప్రాంతంలో ఊగాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొండ అంచు ప్రాంతాలలో ఊయల ఊగాలి అంటే ఎంత త్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ విధంగానే ఇద్దరు యువతులు కొండ అంచు ప్రాంతంలో ఊయల ఊగాలనీ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఊయల ఊగుతూ ఆ అనుభూతిని ఆస్వాదించారు. అయితే ఊగుతున్న ఊయల నుంచి దిగడానికి ప్రయత్నించిన వీరు ఏకంగా 6300 అడుగుల లోతు ఉన్న లోయలో పడిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

రష్యాలోని డాగేస్టన్‌లో సులాక్ కాన్యాన్‌ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం కొండ అంచున ఓ ఉయ్యాల ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఎంతో సరదాగా ఉయ్యాలలో ఊగుతూ సంబరపడిపోతూ ఉంటారు. అయితే ఈ ఉయ్యాలలో ఊగేవారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా 6300 అడుగుల లోతు ఉన్న లోయలో పడి పోవాల్సిందే. ఇదే విషయమే అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించిన ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు.

తాజాగా ఈ ఉయ్యాల నుంచి ఇద్దరు మహిళలు సరదాగా ఊగుతూ పొరపాటున ఈ లోయలోకి పడ్డారు. అయితే వీరి అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టారు.ఇంత ఎత్తు నుంచి పడిన వారు ప్రాణాలతో బయటపడ్డారు అంటే నిజంగా ఇది వారి అదృష్టం అని చెప్పవచ్చు. ఈ ఉయ్యాలలో ఊగడానికి వెళ్లిన ఇద్దరు యువతులు ఆ లోయ లోతును చూసి భయపడ్డారు. ఈ క్రమంలోనే వారు కదులుతున్న ఊయల నుంచి దిగడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా ఊయల వారిని తోసింది.

ఈ విధంగా ఊయల నుంచి కిందపడిన ఆ యువతులు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ఆ ఉయ్యాల ఇంకాస్త వేగంగా ఊగి ఉంటే వారు ఆ లోయలో పడి ప్రాణాలను కోల్పోయే వారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago