సాధారణంగా ఊయల ఊగాలి అంటే అందరూ ఎంతో సరదా పడతారు. కానీ అదే ఊయల కొండ అంచు ప్రాంతంలో ఊగాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొండ అంచు ప్రాంతాలలో ఊయల ఊగాలి అంటే ఎంత త్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ విధంగానే ఇద్దరు యువతులు కొండ అంచు ప్రాంతంలో ఊయల ఊగాలనీ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఊయల ఊగుతూ ఆ అనుభూతిని ఆస్వాదించారు. అయితే ఊగుతున్న ఊయల నుంచి దిగడానికి ప్రయత్నించిన వీరు ఏకంగా 6300 అడుగుల లోతు ఉన్న లోయలో పడిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

రష్యాలోని డాగేస్టన్‌లో సులాక్ కాన్యాన్ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం కొండ అంచున ఓ ఉయ్యాల ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఎంతో సరదాగా ఉయ్యాలలో ఊగుతూ సంబరపడిపోతూ ఉంటారు. అయితే ఈ ఉయ్యాలలో ఊగేవారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా 6300 అడుగుల లోతు ఉన్న లోయలో పడి పోవాల్సిందే. ఇదే విషయమే అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించిన ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు.
తాజాగా ఈ ఉయ్యాల నుంచి ఇద్దరు మహిళలు సరదాగా ఊగుతూ పొరపాటున ఈ లోయలోకి పడ్డారు. అయితే వీరి అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టారు.ఇంత ఎత్తు నుంచి పడిన వారు ప్రాణాలతో బయటపడ్డారు అంటే నిజంగా ఇది వారి అదృష్టం అని చెప్పవచ్చు. ఈ ఉయ్యాలలో ఊగడానికి వెళ్లిన ఇద్దరు యువతులు ఆ లోయ లోతును చూసి భయపడ్డారు. ఈ క్రమంలోనే వారు కదులుతున్న ఊయల నుంచి దిగడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా ఊయల వారిని తోసింది.
ఈ విధంగా ఊయల నుంచి కిందపడిన ఆ యువతులు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ఆ ఉయ్యాల ఇంకాస్త వేగంగా ఊగి ఉంటే వారు ఆ లోయలో పడి ప్రాణాలను కోల్పోయే వారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.































