సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం చాలా బోర్ గా ఫీల్ అవుతాము. ఈ క్రమంలోనే కొందరు సరదాగా మ్యూజిక్ వింటూ ఉంటారు. మరి కొందరు ఏదైనా వేరే దారి ఉంటే ఆ మార్గాన వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ యువకుడు ట్రాఫిక్ జామ్ అవడంతో బోర్ కొడుతుందని ఏకంగా నదిలో దూకిన ఘటన లుసియానాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
జిమ్మి ఇవాన్ జెన్నింగ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి షికారు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే
బాసిన్ బ్రిడ్జ్ మీద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ ఏర్పడింది. గంటల తరబడిన ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఎంతో విసుగు చెందిన జెన్నింగ్ ఇక నేను ఇక్కడ వెయిట్ చేయలేను.. ఆ నదిలో దూకి వెళ్ళిపోతాను అంటూ స్నేహితులతో చెప్పాడు. అయితే జెన్నింగ్ సరదాగా చెప్పాడని భావించిన స్నేహితులు అతడు దూకుతూ ఉండగా వీడియో తీశారు.
ఏకంగా వంద అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి అచ్చఫాలయ నదిలోకి దూకాడు. ఆ నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కాసేపటి వరకు జెన్నింగ్ కనిపించకపోవడంతో తన స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ క్రమంలోనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతను కనిపించలేదు. మరొక విషయం ఏమిటంటే ఆ నదిలో ఎక్కువగా మొసళ్ళు ఉంటాయని తెలియక నదిలో దూకాడు స్థానికులు చెబుతున్నారు.
జెన్నింగ్ ఎంతసేపటికి కనిపించకపోవడంతో అతను చనిపోయి ఉంటాడని భావించారు. కానీ నదిలో కొంత దూరంలో ఒక దీవి ఉండటంతో కష్టపడుతూ అక్కడికి చేరుకున్నాడు. ఆ దేవి పై జెన్నింగ్ ఉండటాన్ని గమనించిన పోలీసులు అతనిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడన్న అనుమానంతోనే అతనిని అరెస్టు చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం జెన్నింగ్స్ నదిలో దూకిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…