మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన పెద్ద పొరపాటు అదేనా..!?

సౌత్‌లో ఇప్పుడు కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషలలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈమె కి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండటంవల్ల సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఏమాత్రం కష్టపడల్సిన అవసరం రాలేదు. బాల నటిగానే పాపులారిటీ తెచ్చుకుంది కీర్తి సురేష్. కీర్తీ సురేష్ అమ్మ గారు మలయాళ నటి మేనక. ఈవిడి చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేశారు. కీర్తి నాన్నగారు మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్. ఇక కీర్తీ అక్క రేవతీ సురేష్..కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ లో వి.ఎఫ్.ఎక్స్ విభాగంలో పలు హిందీ సినిమాలకి పనిచేశారు. కీర్తి నాలుగో తరగతి వరకు చెన్నైలో చదువుకున్నారు. ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో కంటిన్యూ చేసింది. మళ్ళీ చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్ లో రెండు నెలల ఇంటర్న్షిప్ లో జాయిన్ అయింది. అంటే కీర్తి ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే, ఇప్పుడు కీర్తి డిజైనింగ్ లో ఉండేదాన్ని అని..గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

2000 – 2002 వరకు బాల నటిగా సినిమాలు చేసింది. అవన్నీ కూడా మలయాళంలో విడుదలయ్యాయి. 2013లో హీరోయిన్‌గా మారింది. హీరోయిన్ ఎంట్రీ కూడా మలయాళంలోనే జరిగింది. గీతాంజలి అనే సినిమాతో కీర్తి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఇదు ఎన్న మాయం అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో అడ్డాల చంటి నిర్మాతగా రెండుజెళ్ళ సీత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో 2016లో వచ్చిన నేను శైలజ ఆమె తెలుగు డెబ్యూ సినిమా అయింది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకున్న కీర్తి సురేష్.. నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి సినిమాలు చేసింది. వీటిలో అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అయితే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి కీర్తి సురేష్ కి ఎంతో కీర్తి ప్రతిష్టలు దక్కేలా క్రేజ్ తీసుకు వచ్చింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఈమె పేరు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కీర్తిని ప్రశంసించారు. ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ సౌత్‌లో అసాధారణంగా పెరిగిపోయింది. దాంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

ఈ క్రేజ్‌ని కీర్తి బాగానే ఉపయోగించుకుంది. కానీ కొన్ని అనవసరమైన సినిమాలను కమిటయి పొరపాటు చేసింది. మహానటితో వచ్చిన క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటవడం కీర్తి చేసిన మిస్టేక్ అని ఆ సినిమా రిజల్ట్ తర్వాత అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయాపడ్డరు. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు గత ఏడాది ఓటీటీలో రిలీజై తీవ్రంగా నిరాశపరచాయి. ఈ రెండు సినిమాలతో ఆమె క్రేజ్ చాలా వరకు తగ్గిందనే కామెంట్స్ వినిపించాయి. మిస్ ఇండియా సినిమా అయితే అసలు ఎందుకు ఒప్పుకుందో కూడా చాలా మందికి అర్థం కాలేదట. ఆ తర్వాత రంగ్ దే కూడా ఆశించిన విధంగా కీర్తికి పాపులారిటీ తీసుకు రాలేకపోయింది. ఈ క్రమంలో గుడ్ లక్ సఖీ సినిమా డిలే అయింది. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో గానీ ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయకూడదని కీర్తి డిసైడయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె సర్కారు వారి పాట, అన్నాత్తే చేస్తోంది.