బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్ శీనుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో తన కామెడీ పంచుల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూ అందరిని ఆకట్టుకుంటాడు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శీను బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు వచ్చి ఎంతో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా గెటప్ శీను తన గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా మరొక లేడీ కమెడియన్ ను పందికొక్కు అంటూ గెటప్ శీను దారుణంగా ట్రోల్ చేశాడు.
ఈ కార్యక్రమంలో భాగంగా గెటప్ శీను ఎంట్రీ ఇస్తూ లేడీ కమెడియన్ రోహిణితో ఏంటి డల్ గా ఉన్నావ్.. అంటూ కామెడీ వాయిస్ తో ప్రశ్నించాడు. అందుకు రోహిణి బాధతో తాను పండించిన పంటను మొత్తం పందికొక్కులు తింటున్నాయని చెబుతుంది.అప్పుడు గెటప్ శీను నువ్వు పండించిన పంటను నువ్వే తినడం ఏంటి అంటూ.. తన పై పంచ్ డైలాగ్ వేశాడు. అంటే రోహిణి కూడా పందికొక్కు అని చెప్పకనే చెబుతూ ఆమెను అతి దారుణంగా ట్రోల్ చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…