బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీ” కార్యక్రమంలో కమెడియన్లు చేసే స్కిట్ లు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇదివరకే హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని తప్పుబడుతూ చేసిన స్కిట్ ఏకంగా పోలీస్ కేసు దాకా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ క్రమంలోని శ్రీమంతుడు కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.
ఈ క్రమంలోనే జూలై 11 న ప్రసారమైన ఈ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వి రాజ్ మరొక కమెడియన్ గౌతమ్ రాజు పేరును ప్రస్తావించడంతో ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ స్కిట్ లో భాగంగా కమెడియన్ నూకరాజు పృథ్వీరాజ్ తో మాట్లాడుతూ… సార్ మేము ఇప్పుడైతే పేదోళ్లం కానీ ఒకప్పుడు రాజులం సార్’.. అని అంటారు. రాజులా.. అదేంటి? అని పృథ్వీ అడగ్గా.. ‘నేను నూకరాజు.. మా తమ్ముడు లోక రాజు.. మా నాన్న పోతురాజు అని నూకరాజు చెప్పగానే అందుకు పృధ్విరాజ్… ఆ ఇది చెప్పుకుని ఆ గౌతమ్ రాజు గాడు కూడా బతికేస్తున్నాడు. అని పంచు డైలాగ్ వేశాడు.
ఈ విధంగా పృద్వి రాజ్ గౌతమ్ రాజు పై పంచులు వేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. పృథ్వీరాజ్ గౌతమ్ రాజును ఉద్దేశించే ఈ డైలాగ్ వేశారని ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారడంతో తను ఆ గౌతమ్ రాజును దృష్టిలో ఉంచుకొని ఈ మాట అనలేదని, పొరపాటుగా జరిగిపోయిందని నటుడు పృథ్వీరాజ్ ఒప్పుకున్నారు.
ఈ స్క్రిప్ట్ లో భాగంగా కావాలని నేను గౌతమ్ రాజు పేరు వాడుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏదో సందర్భానుసారంగా నా ప్రమేయం లేకుండా జరిగిపోయిందని, ఏది ఏమైనా పొరపాటు జరిగింది ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అంటూ పృధ్వీరాజ్ ఒక వీడియోలో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…