నిమజ్జన వేడుకలో విషాదం.. వర్షంలో ట్రాక్టర్ అదుపు తప్పి.. దారుణంగా?

సాధారణంగా దసరా తర్వాత రోజు నుంచి దుర్గామాత నిమజ్జన ఉత్సవాలు జరగుతాయి. అయితే ఈ ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దీంతో అక్కడ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడటంతో ప్రమాదం సంభవించింది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

వాళ్లు కమలాపురం నుంచి మున్నేరులో విగ్రహ నిమజ్జనం కోసం వెళ్తున్నారు. ఒక ట్రాక్టర్ లో విగ్రహాన్ని ఉంచారు.. మరో ట్రాక్టర్ లో భక్తులు కూర్చుకున్నారు. విగ్రహం ఉన్న ట్రాక్టర్ మున్నేరు వద్దకు వచ్చింది. ఇక నిమజ్జనం చేయడమే ఆలస్యం..కానీ వెనుక ఉన్న ట్రాక్టర్ వస్తున్న క్రమంలో వర్షం ఫుల్ గా వచ్చింది. దీంతో ఆ స్పీడ్ లో అయ్యగారిపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది.

ప్రమాద సయంలో అక్కడ భక్తులు అంతా నిమజ్జన ఉత్సవంలో ఉండగా.. డ్రవర్ మాత్రం మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అందులో నలుగురు చనిపోగా.. మరికొందరికి గాయాలు అయ్యాయి. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.