సాధారణంగా దసరా తర్వాత రోజు నుంచి దుర్గామాత నిమజ్జన ఉత్సవాలు జరగుతాయి. అయితే ఈ ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
దీంతో అక్కడ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ప్రమాదం సంభవించింది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వాళ్లు కమలాపురం నుంచి మున్నేరులో విగ్రహ నిమజ్జనం కోసం వెళ్తున్నారు. ఒక ట్రాక్టర్ లో విగ్రహాన్ని ఉంచారు.. మరో ట్రాక్టర్ లో భక్తులు కూర్చుకున్నారు. విగ్రహం ఉన్న ట్రాక్టర్ మున్నేరు వద్దకు వచ్చింది. ఇక నిమజ్జనం చేయడమే ఆలస్యం..కానీ వెనుక ఉన్న ట్రాక్టర్ వస్తున్న క్రమంలో వర్షం ఫుల్ గా వచ్చింది. దీంతో ఆ స్పీడ్ లో అయ్యగారిపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది.
ప్రమాద సయంలో అక్కడ భక్తులు అంతా నిమజ్జన ఉత్సవంలో ఉండగా.. డ్రవర్ మాత్రం మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అందులో నలుగురు చనిపోగా.. మరికొందరికి గాయాలు అయ్యాయి. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…