Senior Acress Radha Prashanti : ఆ నిర్మాత బట్టలు మార్చుకుంటుంటే చూసాడు.. అర్ధరాత్రి గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచాడు. : రాధాప్రశాంతి.

Senior Acress Radha Prashanti : లైంగిక వేధింపులు.. ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌లు వారున్న ఆఫీసుల్లో, ప‌రిసరాల్లో ఎదుర్కొంటున్న ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఇది. తోటి ఉద్యోగులు, పై అధికారులు మ‌హిళ‌ల‌ను ఇబ్బందికి గురి చేస్తున్నారనేది కాదనలేని నిజం.ఇందులో సినీ ప‌రిశ్ర‌మ కూడా భాగ‌మైన త‌ర్వాత చాలా మంది మ‌హిళ‌లు సినీ ఇండ‌స్ట్రీలో తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ల‌ను బ‌య‌ట పెట్టారు. ఇలా గుట్టుగా ఉంటూ వ‌చ్చిన స‌మ‌స్య‌లు బ‌య‌ట ప‌డ‌టంతో ఒక్క‌సారి సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద దుమార‌మే రేగింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్నీ రంగాల్లోనూ ఉంది. కానీ మీడియా కార‌ణ‌మో, మ‌రేదైనా కార‌ణ‌మో ఏమో కానీ.. సినీ ప‌రిశ్ర‌మ‌పైనే ఫోక‌స్ ఎక్కువైంది.

ప‌లువురు న‌టీమ‌ణులు, హీరోయిన్స్ అంద‌రూ సినీ ఇండ‌స్ట్రీలో తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌పై నోరు విప్పారు. అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయ‌డం అనే సంస్కృతిని తెలుగు సినిమాలోనూ చూశాం.చాలా మంది మ‌హిళ‌లు కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారే.. 1990 ప్రాంతంలో అనేక తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే రాధాప్రశాంతి. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో రాధా ప్రశాంతి అనేక క్యారెక్టర్స్ పోషించింది. అయితే తాను ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాదాల రంగారావు హీరోగా నేను ఒక ఊరి జమీందారు భార్యగా ఒక చిత్రంలో నటించాం.

ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఆ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుండి అర్ధరాత్రి నాకు ఓ ఫోన్ వచ్చింది. మా బ్రదర్ ఎత్తారు. ఎవరు మాట్లాడేదన్నారు.ఏం.. పేరు చెప్తే గాని ఆవిడకు ఫోన్ ఇవ్వరా? అని అన్నారు. దాంతో ఎక్కువ మాట్లాడకుండా మా తమ్ముడు నాకు ఫోన్ ఇచ్చారు. సినిమాకు సంబంధించి మాట్లాడాలి ఒకసారి గెస్ట్ హౌస్ కు వస్తారా? అని అడిగాడు. నాకు సంబంధించి షెడ్యూలు అయిపోయింది. మళ్లీ గెస్ట్ హౌస్ కి ఎందుకండి అని అన్నాను. ఇక్కడ నిర్మాత, దర్శకుడు. హీరోస్ సిట్టింగ్ లో ఉన్నారు. మీరు రండన్నారు. అవును గెస్ట్ హౌస్ అన్నాక హీరో, డైరెక్టర్, నిర్మాత సిట్టింగ్స్ ఉంటాయి, స్టాండింగ్స్ ఉంటాయి. అక్కడికి నేనెందుకు రావాలన్నాను. ఇలాంటి వాళ్లను చాలామంది చూసాం. ఇలా అయితే సినిమాల్లో ఎక్కువ రోజులు ఉండరని ఏవేవో మాట్లాడారు. సరే వస్తాను అని ఫోన్ పెట్టేసాను. నేను మా తమ్ముడు ఒక కారులో, మాకు తెలిసిన వాళ్ళు మరొక కారులో గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. లోపలికి వెళ్లి మేనేజర్ తో.. నాకు ఇచ్చిన షెడ్యూల్ అయిపోయింది. డైరెక్టర్ నాకు వన్ వీక్ బ్రేక్ ఇచ్చారు.

ఇప్పుడు నటించడానికి డేట్స్ కూడా లేవు. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావాలని మా తమ్ముడు, నేను ఇద్దరం ఆ ప్రొడక్షన్ మేనేజర్ ని నిలదీశాం. అక్కడ ఉన్నవారు జోక్యం చేసుకొని ఆయన దురుద్దేశంతో చేయలేదని, వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు చేయబోయి మీకు ఫోన్ చేశారని మమ్మల్ని ఏదో అప్పటికి అలా కప్పిపుచ్చారు. ఆ రోజు మేము అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ షెడ్యూల్లో.. ఒక పల్లెటూరులో రచ్చబండకు సంబంధించిన సీన్ చిత్రీకరణ జరుగుతుంది. షూటింగ్ విరామంలో ఒక గదిలోకి వెళ్లి నేను బట్టలు మార్చుకుంటూ ఉండగా.. ఆ సినిమా మేనేజర్ నన్ను చూడడం జరిగింది. ఆడవారు బట్టలు మార్చుకుంటూ ఉంటే గదిలోకి మీరు రావడమేంటని నేను కోపంతో ఆ మేనేజర్ ని నిలదీశాను..

పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లకే ప్రత్యేక గదులు లేవు.వారే చెట్టు చాటుకు బట్టలు మార్చుకుంటారు.సినిమా అన్నాక అన్నిటికీ సిద్ధపడి రావాలన్నారు. గదిలో అటువైపు తిరిగి మార్చుకోండి నేను ఇక్కడే కూర్చుంటానని అనడంతో.. ఆరోజు గెస్ట్ హౌస్ దగ్గర అలా ప్రవర్తించడం ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడంతో నాలో ఉన్న కోపం ఒక్కసారి కట్టలు తెంచుకొని.. వాడిని చెంప చెల్లుమనిపించానని.. ఇప్పుడు ఆ మేనేజర్ ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారన్నారు. ఇలా ముక్కు సూటిగా ఉండడంతో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ లు కూడా మిస్ అయ్యాయని నటి రాధాప్రశాంతి చెప్పుకొచ్చారు.