Political News

Actress Roja: వారి వల్ల నా కూతురు ఎంతో ఇబ్బంది పడింది… ఆవేదన వ్యక్తం చేసిన రోజా?

Actress Roja: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా రాజకీయాలలోకి వచ్చే రాజకీయాలలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.రాజకీయాలలో మొదట్లో కాస్త నిరాశ ఎదురైనప్పటికీ అనంతరం ఈమె ఎమ్మెల్యేగా గెలవడం ప్రస్తుతం అధికార పార్టీలో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ రోజా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోజా తన వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన వృత్తిపరమైన పనుల వల్ల తన పిల్లలపై శ్రద్ధ చూపించే అవకాశం కూడా తనకు లేకుండా పోయిందని ఈమె తెలిపారు. ఇక కరోనా సమయంలో తన పనులకు బ్రేక్ ఇచ్చి తన పిల్లలపై ప్రేమ చూపించే సమయం దొరికినందుకు తాను చాలా సంతోషపడ్డానని తెలిపారు.

ఇక సెలబ్రిటీల జీవితం ఎంతో కష్టతరంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి.కేవలం సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి బాధలు రోజా కూతురు అన్షు మాలిక కూడా పడిందని ఈమె తెలియజేశారు.

Actress Roja: ఇవన్నీ అవసరమా అంటూ మొహం మీదే అడిగింది…


కొందరు సోషల్ మీడియాలో తన కుమార్తె ఫోటోలను మార్పింగ్ చేసే తన గురించి అసభ్యకరమైన పోస్టులు చేశారని రోజా తెలిపారు. ఇది చూసిన తన కుమార్తె ఎంతో ఆవేదన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా రోజా తెలిపారు. అన్షు చాలా సెన్సిటివ్ ఇలాంటి విషయాలు గురించి పదేపదే ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంది అందుకే ఈ విషయాన్ని మేము పెద్దగా చేయలేదు.తన గురించి వచ్చిన ట్రోల్స్ చూసి ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ తనని మొహం మీదే అడిగిందని రోజా తెలిపారు. అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి సర్వసాధారణమేనని తన పిల్లలకు అర్థమయ్యేలా తాను వివరించానని రోజా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago