Chalapathy Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.కైకాల మరణ వార్త నుంచి బయటపడక ముందే చలపతిరావు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఇక ఇండస్ట్రీలో నటుడిగా సుమారు ఐదున్నర దశాబ్దాల కాలం పాటు కొనసాగుతూ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి చలపతిరావు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన గూడచారి 116 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో సుమారు 1200 సినిమాలలో నటించిన ఈయన భారీ మొత్తంలోనే ఆస్తులు కూడా పెట్టి ఉంటారని అందరూ భావిస్తున్నారు.
ఇకపోతే చలపతిరావు ఇండస్ట్రీలో ఉంటూ ఈయన సంపాదించిన ఆస్తుల విలువ చాలా తక్కువ అని మాత్రం చెప్పాలి. ఈయన ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం తన పిల్లల కోసం ఖర్చు చేసి తన పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచారు.ఈయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా కుమారుడు రవిబాబు ఇండస్ట్రీలోనే దర్శకుడిగా నటుడిగా కొనసాగుతున్నారు.
ఇక చలపతిరావు పేరుమీద హైదరాబాదులో పలు ప్రాంతాలలో కేవలం రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయని వీటి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇది మినహా చలపతిరావు పేరుమీద ఏ విధమైనటువంటి ఆస్తులు లేవని ఇండస్ట్రీ సమాచారం. ఏది ఏమైనా అన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన చలపతిరావు ఇంత తక్కువ మొత్తంలో ఆస్తులు కూడా పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…