Jr NTR: టాలీవుడ్ సీనియర్ నటుడు నిర్మాత చలపతిరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఇలా ఈయన మరణ వార్త తెలుసుకున్న టువంటి ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి చలపతిరావుకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే చలపతిరావు నందమూరి కుటుంబానికి ఎంతో మంచి ఆప్తుడు అనే విషయం మనకు తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా ఈయన వారి సినిమాలలో నటించి వారి కుటుంబంలో సభ్యుడిగా మెలిగారు.. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం చలపతిరావును బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. అయితే ఈయన మరణ వార్తా తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ లో ఉన్నారు. అయితే చలపతిరావు మరణ వార్త తెలుసుకున్నటువంటి ఈయన వెంటనే చలపతిరావు కుమారుడు రవి బాబుకి వీడియో కాల్ చేసి చలపతిరావు ఎలా మరణించారనే విషయాలను తెలుసుకోవడమే కాకుండా వీడియో కాల్ ద్వారా ఆయనని చివరి చూపు చూస్తూ లే బాబాయ్ లేయ్ అంటూ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.
ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా చలపతిరావు మరణం గురించి స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. చలపతిరావు గారి మరణ వార్త నన్ను ఎంతగానో కలిచి వేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక ఇంటి సభ్యుడిని కోల్పోయింది.తాత గారి నుంచి తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి చలపతిరావు గారి మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు.ఇక చలపతిరావు కుమార్తెలు అమెరికాలో ఉండటం వల్ల వారు వచ్చిన తర్వాత ఈయన అంత్యక్రియలు జరుగుతాయని రవిబాబు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…